Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ దేశంలో వేశ్యలను బహిరంగంగా ఉరితీస్తారట...

ప్రపంచ పటంలో కంటికి కనిపించీ కనిపించని దేశం ఉత్తర కొరియా. అలాంటి దేశం ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికాకే ముచ్చెమటలు పోయిస్తోంది. అయితే, ఆ దేశంలో దారుణాలకు కూడా హద్దూఅదుపు లేకుండా సాగుతున్నాయట. మ

Advertiesment
ఆ దేశంలో వేశ్యలను బహిరంగంగా ఉరితీస్తారట...
, బుధవారం, 19 జులై 2017 (13:48 IST)
ప్రపంచ పటంలో కంటికి కనిపించీ కనిపించని దేశం ఉత్తర కొరియా. అలాంటి దేశం ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికాకే ముచ్చెమటలు పోయిస్తోంది. అయితే, ఆ దేశంలో దారుణాలకు కూడా హద్దూఅదుపు లేకుండా సాగుతున్నాయట. ముఖ్యంగా వివిధ నేరాలకు పాల్పడే వారి పట్ల అత్యంత క్రూరంగా ఉత్తర కొరియా పాలకులు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. 
 
ఉపాధి కోసం ఉత్తర కొరియాకు వెళ్లి.. ఆ దేశస్థులు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ దేశం నుంచి తప్పించుకుని బయటకు వచ్చి దక్షిణ కొరియాలో జీవితాన్ని గడుపుతున్న అనేక ఉత్తర కొరియాలో తాము ఎదుర్కొన్న బాధలను పూసగుచ్చినట్టు వివరించారు. దీనికి సంబంధించి ఓ నివేదిక బట్టబయలు కాగా, అది కలకలం రేపుతోంది. 
 
స్కూళ్లలోని ఆటస్థలాలు, మార్కెట్లు, షాపింగ్ ప్రాంతాలు... ఇలా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణమేనని, విద్యార్థులు వీటిని ప్రత్యక్షంగా చూస్తున్నారని బాధితులు వెల్లడించారు. ముఖ్యంగా, వేశ్యావృత్తిలో ఉండి పట్టుబడిన వారిని, దొంగలను, దక్షిణ కొరియా వారితో మాట్లాడుతూ, సమాచారాన్ని పంచుకునే వారికి బహిరంగ మరణదండన శిక్షలు విధిస్తున్నారని వారు ఆరోపించారు. 
 
కాగా, మూడేళ్ల నాడు కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్ష బాధ్యతలు  చేపట్టినప్పటి నుంచి మానవ హక్కుల ఉల్లంఘన పెరిగిందని ఐరాస కమిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓ క్రమ పద్ధతిలో హింసించి చంపుతున్నారని కూడా ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పశ్చిమ బెంగాల్‌లో ఘోరం.. చిన్నారిపై ఏడాది పాటు ప్రతిరోజూ మామయ్య అత్యాచారం..