Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాయు - జల - భూమార్గాల ద్వారా దాడులు చేస్తాం : అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్

త‌మ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా గట్టి హెచ్చరిక చేసింది. ఈ దాడులను సైన్యం వాయు, జల, భూమార్గాల ద్వారా ఎ

Advertiesment
వాయు - జల - భూమార్గాల ద్వారా దాడులు చేస్తాం : అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్
, మంగళవారం, 14 మార్చి 2017 (17:18 IST)
త‌మ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా గట్టి హెచ్చరిక చేసింది. ఈ దాడులను సైన్యం వాయు, జల, భూమార్గాల ద్వారా ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేకుండా చేయ‌డానికి తమ సైన్యం సిద్ధ‌మేన‌ని ఉత్త‌ర‌కొరియా అధికార న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ తెలిపింది. 
 
అమెరికా - దక్షిణ కొరియా కూటమి తమ సార్వభౌమాధికారాన్ని అతిక్రమిస్తే తమ సైన్యం గాలి, సముద్రం, భూమిపై నుంచి అత్యంత నిర్దిష్టమైన, దయాదాక్షిణ్యాలు లేని దాడులు చేస్తుందని, అమెరికా సామ్రాజ్యవాదులకు చెందిన అణు సామర్థ్యంగల వాహనాలు, ఇతర వ్యూహాత్మక పరికరాలు సరిహద్దుల్లో కనిపిస్తున్నాయని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ ప్రచురించిన హెచ్చరికలో పేర్కొంది. 
 
కార్ల్‌ విన్సన్‌ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని అభిప్రాయ‌ప‌డింది. మూడు రోజుల క్రితం ఆయా దేశాల‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు తమ ప్రాదేశిక జలాల సమీపంలోకి వచ్చాయని తెలిపింది. కాగా, అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు (ఫోల్ ఈగిల్ డ్రిల్స్) సోమవారం నుంచి ప్రారంభంకాగా, ఈ నెల 1నుంచి జరుగుతున్నాయి. ఈ విన్యాసాలు ఈ నెల 24 వరకు జరుగుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీఆర్పీని వాళ్లలా వాడుకున్నారు... చిరంజీవి జనసేనలోకి రారు.. పవన్ కళ్యాణ్