Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నియంత చేతికి చేరిన మరో ప్రమాదకరమైన ఆయుధం!!

KIm_Daughter

ఠాగూర్

, సోమవారం, 26 ఆగస్టు 2024 (16:54 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడుగా ఉన్న కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం ప్రపంచంలోని దేశ నియంతల్లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి ఆయన చేతిలోకి మరో ప్రమాదకరమైన ఆయుధం చేరింది. తాజాగా ఈ డ్రోన్ పనితీరును కిమ్ స్వయంగా పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలతో ఉత్తర కొరియా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. 
 
ఈ పరీక్షలో భాగంగా పంట పొలాల మధ్య ఉంచిన యుద్ధ ట్యాంకును సూసైడ్ డ్రోన్ ద్వంసం చేయడం ఫొటోలలో కనిపిస్తోంది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న ఓ డ్రోన్ గాల్లోకి లేవడం, వేగంగా దూసుకెళ్లి యుద్ధ ట్యాంకును ఢీ కొట్టడం, ఆపై భారీ పేలుడు చోటుచేసుకోవడం.. తదితర ఘటనలకు సంబంధించిన ఫొటోలు ఈ వీడియోలో ఉన్నాయి.
 
మిగతా డ్రోన్లు లక్ష్యానికి నిర్దేశిత దూరంలో ఆగి క్షిపణి దాడి చేసి తిరిగొస్తాయి. అయితే, ఈ డ్రోన్ మాత్రం నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతుంది. తద్వారా అక్కడ భారీ విధ్వంసం జరుగుతుంది. భూ ఉపరితలంతో పాటు సముద్ర ఉపరితలంలోని లక్ష్యాలను కూడా ఈ డ్రోన్లతో ఛేదించవచ్చని కిమ్ చెప్పారు. అంతర్జాతీయ సైనిక సామర్థ్యాలు, ఆత్మరక్షణ వ్యవస్థలను పరీశీలిస్తే డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికత ఎంత అవసరమో తెలుస్తోందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్‌.. 50 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు..