Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాపై దాడికి ఉత్తర కొరియా సిద్ధం.. హాసంగ్-12 మిస్సైళ్ల‌తో ప్లాన్

అగ్రరాజ్యం అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధం అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉ.కొరియా అధ్యక్షుడు జింగ్ పిన్ ఉన్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల పరిస్థితి మరింత దిగజారింది.

అమెరికాపై దాడికి ఉత్తర కొరియా సిద్ధం.. హాసంగ్-12 మిస్సైళ్ల‌తో ప్లాన్
, గురువారం, 10 ఆగస్టు 2017 (14:54 IST)
అగ్రరాజ్యం అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధం అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉ.కొరియా అధ్యక్షుడు జింగ్ పిన్ ఉన్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల పరిస్థితి మరింత దిగజారింది. పైపెచ్చు అమెరికాపై హాసంగ్ -12 మధ్యంతర్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తామంటూ ఆయన ప్రకటించడం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పింది. 
 
ప్రధానంగా ఇరు దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే ప‌సిఫిక్ స‌ముద్రంలో ఉన్న‌ అమెరికా దీవి గువామ్‌ను టార్గెట్ చేయాల‌ని ఉత్త‌ర కొరియా ప్లానేసినట్టు వార్తలు వస్తున్నాయి. గువామ్ దీవిపై నాలుగు హాసంగ్‌-12 క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించాల‌ని నార్త్ కొరియా భావిస్తోంది. జ‌పాన్ స‌ముద్ర జ‌లాల మీదుగా వాటిని ప్ర‌యోగించాల‌ని ఉత్త‌ర కొరియా ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు సమాచారం. మిస్సైళ్ల దాడికి సంబంధించి కొరియా క‌మాండ‌ర్ తుది ప్లాన్‌ను ర‌చిస్తున్నాడు. మ‌రోవారం రోజుల్లోగా ఫైన‌ల్ ప్లాన్ రెఢీ అవుతుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ దాడికి కిమ్ జాంగ్ ఉన్ పచ్చజెండా ఊపాల్సివుంది. 
 
కాగా, ఉత్త‌ర కొరియా నుంచి గువామ్ దీవి సుమారు 3400 కిలోమీట‌ర్లు ఉంటుంది. అయితే అంతదూరంలో ఉన్న టార్గెట్‌ను ఆ దేశ మిస్సైళ్లు చేరుకుంటాయో లేదో అన్న సందేహం కూడా వ్య‌క్తమవుతోంది. హాసంగ్‌-12 మిస్సైళ్ల‌ను మొద‌టిసారి ఈ యేడాది ఏప్రిల్‌లో జ‌రిగిన మిలిట‌రీ ప‌రేడ్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఇది ఇంట‌ర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిప‌ణి కావ‌డం విశేషం. హాసంగ్ క్షిప‌ణి సుమారు 3700 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌గ‌ల‌దు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాల బైపోల్‌పై 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటి జోస్యం.. ఎవరిది గెలుపు?