Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'అల్లాహో అక్బర్' అంటూ ఢాకాలో ఉగ్రవాదుల కాల్పులు.. కాల్చి చంపిన భద్రతా బలగాలు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ భవనాన్ని ఉగ్రవాదులు చుట్టుముట్టారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు మెరుపుదాడి చేసి మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి.

'అల్లాహో అక్బర్' అంటూ ఢాకాలో ఉగ్రవాదుల కాల్పులు.. కాల్చి చంపిన భద్రతా బలగాలు
, మంగళవారం, 26 జులై 2016 (09:28 IST)
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ భవనాన్ని ఉగ్రవాదులు చుట్టుముట్టారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు మెరుపుదాడి చేసి మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. వీరంతా అనుమానిత ఐఎస్‌ ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.
 
సోమవారం రాత్రి ఢాకాలోని ఓ భవనాన్ని ముట్టడించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. 2 గంటలసేపు జరిగిన ఎదురెదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారని, ఒకరిని అదుపులోకి తీసుకున్నామని ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (డీఎంపీ) మసూద్ అహ్మద్ వెల్లడించారు.
 
కల్యాణ్‌పూర్ సమీపంలో ఉగ్రవాదులు ఒక భవంతి నుంచి బాంబులు విసురుతుండగా చుట్టుముట్టామని, రాత్రి నుంచి ఎదురెదురు కాల్పులు జరిగాయని చెప్పారు. ఇస్లామిక్ సాయుధులు కాల్పులు జరుపుతూ మధ్యమధ్యలో అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేసినట్టు చెప్పారు. ఆపరేషన్ స్టార్ 26 పేరుతో సాయుధపోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సమర్ధవంతంగా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఢాకా అడిషనల్ పోలీస్ కమిషనర్ షేక్ మరుఫ్ హసన్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై అత్యాచారం చేశాడు.. యావజ్జీవ ఖైదీ అయ్యాడు.. కానీ విడుదలయ్యాడు ఎలా?