Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నైజీరియాలో, ఇస్తాంబుల్‌లో జంట పేలుళ్లు.. 80 మందికి పైగా మృతి

నైజీరియాలో టెర్రరిస్టులు మళ్లీ పెచ్చరిల్లిపోయారు. మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 45 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలపాలయ్యారు. ఈ దాడిక

Advertiesment
నైజీరియాలో, ఇస్తాంబుల్‌లో జంట పేలుళ్లు.. 80 మందికి పైగా మృతి
, ఆదివారం, 11 డిశెంబరు 2016 (11:09 IST)
నైజీరియాలో టెర్రరిస్టులు మళ్లీ పెచ్చరిల్లిపోయారు. మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 45 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలపాలయ్యారు. ఈ దాడికి పాల్పడినది బోకోహారమ్‌కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. 
 
మరోవైపు టర్కీ ముఖ్యనగరమైన ఇస్తాంబుల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ పేలుళ్లు సంభవించాయి. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు సమాచారం. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు తెలియవచ్చింది. తొలి పేలుడు ఫుట్‌బాల్‌ స్టేడియం బయట జరగగా.. రెండోది ఓ పార్క్‌ ఆవరణలో జరిగినట్లు సమాచారం. 
 
ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అనంతరం అభిమానులంతా ఇళ్లకు చేరుకున్న తర్వాత పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంత ప్రాధేయపడినా అత్తను చూడనివ్వలేదు.. 8గంటల పాటు ఎదురుచూశాను: దీపా జయకుమార్