పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. అలాంటి తరుణంలో రైలు పట్టాలపై పెట్రోల్‌తో నిండిన లారీ బోల్తా పడింది. అందులో పెట్రోల్, డీజిల్ అంతా వృధా అవుతోంది. దీన్ని చూసిన జనం వూరుకుంటారా? అంతే వాటర్ బాటిల్స్ పట్టుకెళ్లారు. వృధా అవుతున్న పెట్రోల్‌ను ఇంటికి తెచ్చుకునేందుకు ఎగబడ్డారు. అయితే అదే వారి పాలిట శాపం అయ్యింది.
ట్యాంకర్ లారీ నుంచి పెట్రోల్ పట్టేందుకు వెళ్లిన 55 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఆఫ్రికా దేశమైన నైజరిల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నైజిరిన్‌లో అదుపు తప్పిన ట్యాంకర్ లారీ రైలు పట్టాలపై బోల్తా పడింది. ఆ లారీ నుంచి పెట్రోల్ లీక్ కావడం ప్రారంభమైంది. దీన్ని చూసిన ప్రజలు పెట్రోల్‌ను బాటిల్స్‌లో నింపుకున్నారు.
అయితే అనూహ్యంగా ట్యాంకర్ లారీ పేలడంతో దారుణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 30 మందికి పైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటవ నైజరిన్‌లోని ఎయిర్‌పోర్టుకు సమీపంలో చోటుచేసుకుంది.