Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లైంగిక వేధింపుల కేసుతో న్యూయార్క్ గవర్నర్ రాజీనామా

లైంగిక వేధింపుల కేసుతో న్యూయార్క్ గవర్నర్ రాజీనామా
, బుధవారం, 11 ఆగస్టు 2021 (10:51 IST)
అమెరికాలో ప్రధాన నగరమైన న్యూయార్క్‌ గవర్నర్‌గా ఆండ్రూ క్యూమో రాజీనామా చేశారు. ఆయన పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలను క్యూమో ఖండించారు.

ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎప్పుడూ అలా అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పారు. ఆయన వద్ద గతంలో పని చేసిన ఒక మహిళ ఈ విషయంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిజానిజాలు నిగ్గుతేల్చడం కోసం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ ప్యానెల్.. దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

ఆయన కనీసం 11 మంది మహిళలను తాకరాని చోట తాకడం వంటి అసభ్య ప్రవర్తనతోపాటు, ఇండైరెక్టుగా తన కోరికను వెల్లడించారని ఈ ప్యానెల్ తేల్చింది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు క్యూమో ప్రకటించారు.

‘‘ఇప్పుడు నేను చేయగలిగింది ఒక్కటే. ప్రభుత్వాన్ని తన పని చేసుకోనివ్వడం’’ అని క్యూమో ఒక వీడియో సందేశం విడుదల చేశారు. మరో 14 రోజుల్లో ఆయన తన ఆఫీసును వీడనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 55 శాతం కరోనా కేసులు కేరళలోనే..!