Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వార్ధక్యానికి కారణమయ్యే కీలక ప్రోటీన్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు!!

old aged

వరుణ్

, శుక్రవారం, 19 జులై 2024 (11:32 IST)
ప్రతి ఒక్కరికి వృద్దాప్యం అనేది తప్పనిసరి. అయితే, వృద్దాప్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో బలహీనంగా ఉంటారు. దీనికి కారణం శరీరంలో కనిపించే ఐఎల్-11 ప్రోటీన్ అని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అంశంపై ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఆశించిన ఫలితాలు వచ్చినట్టు వారు వెల్లడించారు. ముఖ్యంగా, ఎలుకలపై ఈ ప్రోటీన్ నిరోధక చికిత్స అద్భుతల ఫలితాలను ఇచ్చినట్టు పేర్కొన్నారు. పైగా, ఎలుకల్లో ఆయుర్ధాయం పెరుగుద, శారీరక దృఢత్వం వృద్ధి చెందినట్టు తెలిపారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా వృద్దాప్యాన్ని జయించేందుకు ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతుండగా తాజాగా కీలక ముందడుగు పడింది. వార్ధక్యానికి కారణమయ్యే ఓ కీలక ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీన్ని కట్టడి చేసే చికిత్స ద్వారా ఎలుకల జీవితకాలాన్ని ఏకంగా 25 శాతం మేర పెంచగలిగారు.
 
వయసు పెరుగుదలకు ఇంటర్ ల్యూకిన్-11 అనే ప్రొటీన్ కారణమవుతోందని సింగపూర్‌లోని డ్యూక్-ఎనోయూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరుపై ఐఎల్-11 కీలక ప్రభావం చూపుతోందని గుర్తించారు. వయసుతో పాటు ఈ ప్రొటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ శారీరక ధృడత్వాన్ని తగ్గించి, తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగిస్తోందని తెలిపారు.
 
ఐఎల్-11 ప్రొటీన్‌ను నిరోధించిన శాస్త్రవేత్తలు ఎలుకల జీవిత కాలం 25 శాతం మేర పెంచగలిగారు. ఆడ ఎలుకల్లో ఐఎల్-11 నిరోధక చికిత్స ద్వారా శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత, మొదలైన వాటి నుంచి రక్షణ లభించింది. ఇదే చికిత్సతో మగ ఎలుకల జీవితకాలం 22.5 శాతం మేర పెరిగింది. అంతేకాకుండా, ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు, క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తి ఎలుకల్లో మొదలైంది. 
 
ఈ ఫలితాలపై డ్యూక్-ఎన్ యూఎస్ డీన్ ప్రొఫెసర్ సథామస్ కాఫ్మన్ మాట్లాడుతూ.. ఐఎల్-11 చికిత్సతో వృద్ధులు మరింత ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయని చెప్పారు. శారీరక దృఢత్వం పెరిగి వృద్ధులు జారి పడే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. 'ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకాలిక జీవితాలు గడిపేలా ఐఎల్-11 చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం' అని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త స్టార్ట్కుక్ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు వార్షిక రొట్టెల పండుగ.. సీఎం చంద్రబాబు వర్చువల్ సందేశం