Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ప్రపంచం చూసింది... మాట్లాడలేదు...: నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో పలు ఒప్పందాలపై చర్చించి నిర్ణయం తీసుకోననున్నారు. ఆరోగ్యం, పరిశ్రమలు తదితర అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ... తనను తాను రక్షించుకు

సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ప్రపంచం చూసింది... మాట్లాడలేదు...: నరేంద్ర మోదీ
, సోమవారం, 26 జూన్ 2017 (19:56 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో పలు ఒప్పందాలపై చర్చించి నిర్ణయం తీసుకోననున్నారు. ఆరోగ్యం, పరిశ్రమలు తదితర అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ... తనను తాను రక్షించుకునేందుకు ఇండియా ఎంతవరకైనా వెళుతుందని సర్జికల్ దాడుల ద్వారా తెలిపిందన్నారు. 

ఉగ్ర‌వాద నిజ‌స్వ‌రూపాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డంలో భార‌త్ విజ‌య‌వంత‌మైందనీ, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై స‌ర్జిక‌ల్ దాడులు చేసిన‌ప్పుడు ప్రపంచంలోని ఏ దేశమూ భారతదేశాన్ని ప్రశ్నించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. ఉగ్రవాదులను ఏరివేయాల్సిందేనని ఇప్పుడు ప్రపంచం అంటోందన్నారు. 
 
20 ఏళ్ల క్రితం ఉగ్రదాడుల గురించి మాట్లాడినప్పుడు అది ఓ శాంతిభద్రతల సమస్యగా చూసిన ప్రపంచం ఇప్పుడు ఉగ్రవాదం అంటే ఏమిటో చూస్తుందన్నారు. భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందనీ, నిగ్రహాన్ని పాటిస్తుందని మోదీ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిలప్రియ సవాల్... ఆమె మంత్రి పదవికి గుదిబండగా మారుతుందా?