విదేశీ పర్యటనలపై అధిక ఆసక్తి చూపించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులోభాగంగా ఈనెల 22, 23 తేదీల్లో ఆయన ఇరాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆప్ఘనిస్తాన్, అమెరికా దేశాల్లో కూడా ఆయన పర్యటించే అవకాశం ఉంది. అయితే, ఈ రెండు దేశాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు లేదు.
మరోవైపు.. 22వ తేదీన ఇరాన్‌కు చేరుకునే మోడీ.. ఇరాన్ అధ్యక్షుడు రుహానీతో పలు దౌత్యపరమైన అంశాలపై చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతంతోపాటు, గల్ఫ్ దేశాల్లో రెండో అతిపెద్ద చమురు సరఫరా దేశమైన ఇరాన్ నుంచి చమురు దిగుమతులను రెట్టింపు చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది.
ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాలతోపాటు చాబర్ పోర్టు అభివృద్ధిపైనా చర్చించే అవకాశముంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ ఇరాన్ మత నాయకుడు అలీ ఖమేనీతోనూ భేటీ కానున్నారు.