Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత ప్రధాని మోదీకి అపూర్వ గౌరవం.. ఇజ్రాయెల్ భారతీయుల్లో హర్షాతిరేకాలు

తొలిసారిగా ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అసాధారణరీతిలో స్వాగతం లభించడం ఇక్కడి భారతీయులను ఆనందపరవశులను చేసింది. చివరికి అమెరికా అధ్యక్షులకు సైతం ఇటువంటి గౌరవం దక్కలేదని వారు అంటున్నారు. భారత సంతతికి చెందిన నాలుగు రకాల తెగలవారు

భారత ప్రధాని మోదీకి అపూర్వ గౌరవం.. ఇజ్రాయెల్ భారతీయుల్లో హర్షాతిరేకాలు
హైదరాబాద్ , గురువారం, 6 జులై 2017 (02:38 IST)
తొలిసారిగా ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అసాధారణరీతిలో స్వాగతం లభించడం ఇక్కడి భారతీయులను ఆనందపరవశులను చేసింది. చివరికి అమెరికా అధ్యక్షులకు సైతం ఇటువంటి గౌరవం దక్కలేదని వారు అంటున్నారు. భారత సంతతికి చెందిన నాలుగు రకాల తెగలవారు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. వీరి సంఖ్య  ఎనిమిది లక్షలదాకా ఉంది. వీరిలో కొంతమంది ముంబైకి చెందిన బెనీ తెగవారు కాగా మరికొందరు కేరళలోని కొచిన్‌కు చెందినవారు.
 
 
ఇంకా మణిపూర్, మిజోరాంలకు చెందిన బినై మెనషే తెగవారు ఉన్నారు. ఈ విషయమై ఇక్కడ డ్రైవర్‌గా స్థిరపడిన భారత్‌కు చెందిన డేవిడ్‌ నగని మాట్లాడుతూ ‘16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇక్కడికి వలసవచ్చా. అయితే భారత్‌తో దౌత్యసంబంధాలు లేవని తెలియగానే అప్పట్లో ఎంతో బాధ కలిగింది. అందువల్ల వచ్చే ఇబ్బందులేమిటనే విషయం నాకు అప్పట్లో అంతగా అర్థం కాలేదు. అయితే ఇక్కడ యూదులకు ఎంత గౌరవం లభిస్తుందో అదేస్థాయిలో భారతీయులు కూడా పొందుతారు.ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మన ప్రధానికి ఇచ్చిన గౌరవం నాకు ఎంతో ఆనందం కలిగించింది’ అని చెప్పారు.
 
గత 70 ఏళ్లుగా భారత ప్రధాని తమ గడ్డపై పర్యటించాలని ఎంతో ఆశతో, ఆసక్తితో ఎదురు చూసిన ఇజ్రాయిల్ ఇప్పుడా సమయం ఆసన్నమయ్యేసరికి ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. అమెరికా అధ్యక్షుడికి, పోప్‌కు కూడా దక్కని అపూర్వ గౌరవాన్ని భారత ప్రధాని మోదీ పట్ల ప్రదర్శించిన ఇజ్రాయిల్ ఇరుదేశాల స్నేహ సంబంధాలకు తలుపులు తెరిచేసింది. భారత ప్రధానిని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ముమ్మారు గాఢంగా కౌగలించుకోవడం ఇరుదేశాల భవిష్యత్ చిత్రపటాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెరుపులు, పిడుగులపై హెచ్చరికలు... వజ్రపథ్ యాప్ ఆవిష్కరించిన బాబు