Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్‌తో యుద్ధం తప్పదు.. భారత్ తరపున యుద్ధం చేస్తా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 20 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించి.. యుద్ధవిమానం మిగ్ పైలట్‌గా పని చేసిన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భారత్, ప

పాక్‌తో యుద్ధం తప్పదు.. భారత్ తరపున యుద్ధం చేస్తా : ఉత్తమ్ కుమార్ రెడ్డి
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (10:10 IST)
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 20 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించి.. యుద్ధవిమానం మిగ్ పైలట్‌గా పని చేసిన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం తప్పదనిపిస్తోందని ఆయన అన్నారు. ఉపగ్రహాల సహాయం, నిఘా వర్గాల సాయంతో తీవ్రవాదుల కదలికలు గుర్తించి వారి అంతు చూస్తారని.. యుద్ధ అంశాలపై పూర్తి స్థాయిపట్టు అవసరమని వెల్లడించారు. 
 
అలానే యుద్ధం వస్తే, అవసరం అంటే ఏ క్షణమైనా విధుల్లో జాయిన్ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. దేశానికి సేవ చేయడం కంటే వేరే భాగ్యం ఏముంటుందని... రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఏదీ మర్చిపోయానని అనుకోవద్దని అన్నారు. నాణ్యమైన పరికరాలతో, అద్భుతమైన ప్రణాళికతో, క్లిష్టమైన, అనితరసాధ్యమైన సామర్థ్యంతోనే విజయాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు. 
 
నైట్ విజన్ గాగుల్స్, జీపీఎస్ పరికరాలు, నాణ్యమైన ఆయుధసామాగ్రితో ఇలాంటి కార్యక్రమాలు చేపడతారని ఆయన చెప్పారు. యుద్ధం సమయాల్లో శబ్దవేగానికి రెండు రెట్ల వేగంతో విమానాలను నడపాల్సిన అవసరం ఉంటుందని, ఆ సమయంలో క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో పాటు సాంకేతిక, యుద్ధ అంశాలపై పూర్తి స్థాయిపట్టు అవసరమని ఆయన చెప్పారు. అయితే మన దేశానికి కావాల్సినన్ని వనరులు ఉన్నాయని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌తో యుద్ధం వస్తే సత్తాచాటుతామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఫ్యాంటు జారిపోయింది...