Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముషార్రఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి... వ్యాధి ఏంటంటే....

Advertiesment
ముషార్రఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి... వ్యాధి ఏంటంటే....
, సోమవారం, 18 మార్చి 2019 (14:18 IST)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆయన కాళ్లపై నిలబడలేక పోతున్నారు. దీనికి కారణం ఆయన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముషార్రఫ్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న విషయం తెల్సిందే. ప్ర‌స్తుతం ఆయ‌న్ను అత్య‌వ‌స‌రంగా దుబాయ్ హాస్పిట‌ల్లో చేర్పించారు. 
 
ఆయన అమిలోడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇపుడు ఆ వ్యాధి మళ్లీ ముదరడంతో ముషార్ర‌ఫ్‌ను దుబాయ్‌కి త‌ర‌లించారు. ఈ వ్యాధి కారణంగా ముషార్రఫ్ త‌న కాళ్ల మీద నిల‌బ‌డ‌లేక‌పోతున్నారనీ, న‌డ‌వ‌లేక‌పోతున్నారని తెలిపారు. గ‌తంలో ఇదే వ్యాధి కోసం లండ‌న్‌లో ఆయ‌న ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుది శ్వాస వరకు మాతృభూమి సేవకే అంకితమైన మనోహర్