Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

శాన్‌ఫ్రాన్సిస్కోలో బతుకమ్మ వేడుకలు... ఆడిపాడిన తెరాస ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పది జిల్లాలకే కాకుండా విదేశాలకు కూడా వ్యాపించింది. అక్కడక్కడా అట్టహాసంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ

Advertiesment
MP Kavitha
, సోమవారం, 3 అక్టోబరు 2016 (14:24 IST)
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పది జిల్లాలకే కాకుండా విదేశాలకు కూడా వ్యాపించింది. అక్కడక్కడా అట్టహాసంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. గ్రామాల నుంచి మొదలుకుని పట్టణ, జిల్లా కేంద్రాల్లో బతుకమ్మ సందడి నెలకొంది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుతూ మహిళలు, యువతులు ఉత్సాహాంగా బతుకమ్మ పాటలు పాడుతున్నారు. ఒక్కేసి.. పువ్వేసి చందమామ అంటూ తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ సంబరాలతో హోరెత్తుతుంది. 
 
బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసే క్రమంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులోభాగంగా జాగృతి అధ్యక్షురాలు, రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత శాన్‌ఫ్రాన్సిస్కోలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మను పేర్చిన కవిత.. నాగమల్లె జాతరో పాట పడి బతుకమ్మను పేర్చి ఆడ‌ప‌డుచుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. ఈ బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ఆడపడుచులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓరి దేవుడో... వాళ్లకు చిక్కామంటే ఇంకేమైనా వుందా.. జీలం నదిలోకి దూకి పారిపోతున్న ఉగ్రవాదులు...