ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ హడలెత్తిస్తుంది. దీంతో అనేక ప్రపంచ దేశాలు ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అదేసమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకుని, మాస్కులు ధరించాలంటూ కోరారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఓషధ తయారీ కంపెనీ మోడెర్నా ఓ శుభవార్త చెప్పింది. కోవిడ్ -19 తాజా వేరియంట్ ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా తమ బూస్టర్ వ్యాక్సిన్ యాంటీబాడీ లెవెల్స్‌ను గణనీయంగా పెంచుతుందని ఈ కంపెనీ వెల్లడించింది.
బూస్టర్ డోసులకు ముందున్న యాంటీబాడీలతో పోలిస్తే 50 మైక్రోగ్రాముల బూస్టర్‌తో యాంటీబాడీలను 37 రెట్లు పెంచుతాయని, 100 మైక్రో గ్రాముల బూస్టర్‌తో యాంటీ బాడీలు ఏకంగా 83 రెట్లు పెరుగుతాయని తెలిపింది.
ఇదే అంశంపై ఆ కంపెనీ సీఈవో స్టీఫెన్ బన్సెల్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ కంపెనీ బూస్టర్ డోస్ సురక్షితమైనదని, ఎలాంటి ముఖ్యమైన సైట్ ఎఫెక్ట్స్ తలెత్తకుండా రెండో దశ అధ్యయనంలో తేలిందని చెప్పారు.