'సంతోషాల నగరం'లో దుస్తులు శుభ్రంగా లేవనీ భోజనం పెట్టని ప్రముఖ హోటల్.. ఎక్కడ?
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతా. ఈ సిటీకి 'సంతోషాల నగరం' అనే మరోపేరు కూడావుంది. ఈ నగరంలో ఉన్న గొప్పగొప్ప హోటళ్ళలో 'మొకాంబో' రెస్టారెంట్ ఒకటి. ఈ హోటల్‌లో పసందైన వంటకాల సంగతి సరే, జాజ్ మ్యూజిక్‌తో సందర్
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతా. ఈ సిటీకి 'సంతోషాల నగరం' అనే మరోపేరు కూడావుంది. ఈ నగరంలో ఉన్న గొప్పగొప్ప హోటళ్ళలో 'మొకాంబో' రెస్టారెంట్ ఒకటి. ఈ హోటల్‌లో పసందైన వంటకాల సంగతి సరే, జాజ్ మ్యూజిక్‌తో సందర్శకులకు ఎంతో ఆనందాన్ని పంచుతూ ఉంటుంది. అందుకే ఈ హోటల్ కస్టమర్లతో నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి హోటల్‌లో ఇద్దరికి తీవ్ర అవమానం జరిగింది. దుస్తులు శుభ్రంగా లేవనీ హోటల్ సిబ్బంది భోజనం పెట్టలేదు. ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
దిలాషీ హేమ్నానీ అనే మహిళ.. తన కారు డ్రైవర్ మనీష్ భయ్యాతో కలిసి భోజనం చేసేందుకు మొకాంబో హోటల్‌కు గత శుక్రవారం వెళ్లారు. అయితే, మనీష్ భయ్యా ధరించిన బట్టలు శుభ్రంగా లేవంటూ ఆయనకు భోజనం పెట్టడానికి హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో అతడి యజమాని అయిన హేమ్నానీ తన ఆవేదనను ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు.
దిలాషీ హేమ్నానీ ఆటోమొబైల్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. ఆమెకు అనేక సంవత్సరాలుగా కారు డ్రైవర్‌గా మనీష్ భయ్యా సేవలందిస్తున్నారు. ఆమె కోల్‌కతా నుంచి వెళ్ళిపోతుండటంతో మనీష్‌కు ఘనంగా పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుని, మొకాంబో హోటల్‌కు తీసుకెళ్ళారు. కానీ అక్కడి సిబ్బంది ఆయనను లోపలికి రానివ్వలేదు. ఆయన దుస్తులు బాగోలేవని చెప్పారు. దీనిపై కాసేపు వాగ్వాదం జరిగినా ఫలితం లేకపోయింది. తమ కుటుంబానికి మనీష్ చేసిన సేవలకు కృతజ్ఞతగా విందు ఇవ్వాలనుకున్న దిలాషీ హేమ్నానీ మనసు గాయపడింది. వెంటనే ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయాలను వివరించారు.
దీనిపై హోటల్ మేనేజర్ సోమవారం స్పందిస్తూ కుల, మత, జాతి, వృత్తి భేదాలు లేకుండా అందరికీ స్వాగతం పలికే చిన్న రెస్టారెంట్ మొకాంబో అన్నారు. తమ హోటల్‌కు వచ్చే అతిథులు పరిశుభ్రంగా, చక్కగా వస్త్రాలు ధరించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని తెలిపారు. మహిళతో కలిసి వచ్చిన డ్రైవర్ పరిశుభ్రమైన వస్త్రాలు ధరించలేదని, ఇతర అతిథులకు అసౌకర్యం కలుగకూడదనే ఉద్దేశంతోనే తాము ఆయనను లోనికి రానివ్వలేదని చెప్పారని వివరణ ఇచ్చారు.