Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మొబైల్ నంబరును వాడిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు.. ఆ సంఖ్యలో ఏముందో....

సినిమా సీన్‌ను తలిపించే సంఘటన ఒకటి బల్గేరియాలో జరిగింది. మొబిటెల్ అనే టలికాం సంస్థకు చెందిన ఓ ఫ్యాన్సీ నంబర్‌ను వినియోగించిన వారంతా చనిపోతున్నారట. దీంతో బల్గేరియా వాసులంతా ఆ నెంబరు గురించే ఆసక్తికరంగా

Advertiesment
Mobile phone number
, ఆదివారం, 30 అక్టోబరు 2016 (08:20 IST)
సినిమా సీన్‌ను తలిపించే సంఘటన ఒకటి బల్గేరియాలో జరిగింది. మొబిటెల్ అనే టలికాం సంస్థకు చెందిన ఓ ఫ్యాన్సీ నంబర్‌ను వినియోగించిన వారంతా చనిపోతున్నారట. దీంతో బల్గేరియా వాసులంతా ఆ నెంబరు గురించే ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారట. ఇంతకీ ఆ నెంబర్ ఎంత అంటే.. 0888 888 888. 
 
ఈ నెంబ‌రును తొలిసారిగా మొబిటెల్‌ సంస్థ సీఈవో వ్లాదిమిర్‌ గ్రాస్నవ్ వాడారు. 2001లో ఆయ‌న‌ కేన్సర్‌తో ప్రాణాలు చనిపోయారు. అయితే ఆయ‌న చ‌నిపోయిన కార‌ణం వేరే ఉంద‌ని, బిజినెస్‌లో కలహాలు, హానికారక రేడియో యాక్టివ్‌ పాయిజనింగ్ వ‌ల్లే ఆయ‌న మృత్యువాత ప‌డ్డార‌ని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. 
 
ఆ తర్వాత ఈ నంబరును కాన్‌స్టాంటిన్‌ డిమిట్రోవ్‌ అనే మాఫియా డాన్ వినియోగించాడు. ఆయన కూడా ఓ గుర్తు తెలియ‌ని వ్యక్తి చేతిలో హ‌త‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ఆ ఫ్యాన్సీ నెంబరు 2005లో దిష్‌లీవ్‌ అనే బిజినెస్ మేన్ చేతికి వెళ్లింది. అదే సంవత్సరంలో బల్గేరియా రాజధాని సోఫియాలో ఆయ‌న‌ను ప‌లువురు హత్య చేశారు. ఆ తర్వాత సదరు కంపెనీ ఆ నంబరును బ్లాక్ చేసింది.
 
ప్రస్తుతం ఈ నంబర్‌కు కాల్ చేస్తే 'అవుట్‌ సైడ్‌ నెట్‌వర్క్‌ కవరేజ్' అని వినిపిస్తోంది. ఈ నెంబ‌రు వాడితే ఎందుకు మ‌ర‌ణిస్తున్నార‌ని స‌ద‌రు సంస్థను అడిగితే ఈ విష‌యంపై తాము ఎటువంటి కామెంట్లు చేయబోమ‌ని చెబుతోంది. వ్యక్తిగత నెంబర్ల గురించి తాము మాట్లాడ‌బోమ‌ని సమాధానందాటవేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావో అగ్రనేత ఆర్కే హత్యకు కుట్ర.. ఏ క్షణమైనా మరణ వార్త వినొచ్చు!