Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌-2018

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కల్చరల్ ఫెస్టివల్ 2018కు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌న

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌-2018
, గురువారం, 8 సెప్టెంబరు 2016 (13:12 IST)
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కల్చరల్ ఫెస్టివల్ 2018కు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌ను ఆస్ట్రేలియా, విక్టోరియాకు చెందిన మాజీ ప్రీమియర్ ఎడ్వర్డ్ నోర్మాన్ బైల్లీ ఆహ్వానించారు. ఎడ్వర్డ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం 2018లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే, ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు కూడా శ్రీశ్రీ రవిశంకర్‌కు ఆహ్వానించారు.
 
కాగా, ఢిల్లీలో జరిగిన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌కు ఎడ్వర్డ్ హాజరయ్యారు. ప్రపంచ శాంతి కోసం వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌తో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న కృషిని ఆయనతో పాటు.. పలువురు ఆహ్వానితులు ఎంతగానో ప్రశంసించారు. కాగా, గ్రామీణాభివృద్ధి, విద్య, ఇతర సర్వీసుల్లో సేవలు అందించేందుకు పలువురు ప్రపంచ స్థాయి నేతలను గురుదేవ్ ఆహ్వానిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, బ్రిటన్, కొలంబియా, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్ఏ, మిడిల్ ఈస్ట్‌తో పాటు.. పలు దేశాలకు చెందిన నేతలతో ఆయనకు సంబంధాలు కలిగివున్నాయి. 
 
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌ను ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. 2016లో జరిగిన ఈ ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 3.75 మిలియన్ల మంది హాజరయ్యారు. ఇందులో 100 దేశాలకు చెందిన 37వేల మంది కళాకారులు తమతమ దేశాల సంప్రదాయ నృత్యాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. ఈ ఫెస్టివల్‌ను 188 దేశాల్లో 767,436 మంది టీవీల్లో వీక్షించారు. అంతకుముందు అంటే 2011లో బెర్లిన్ వేదికగా ఈ ఫెస్టివల్ జరుగగా, 150 దేశాలకు చెందిన 70 వేల మంది హాజరయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జైలుకైనా వెళుతాను కానీ, ఇంటికి రాను'... అమెరికా వద్ధుడి శపథం