Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొండి మొగుడుతో వేగలేను... విడాకులకు సిద్ధమైన మెలానియా???

మొండి మొగుడుతో వేగలేను... విడాకులకు సిద్ధమైన మెలానియా???
, గురువారం, 12 నవంబరు 2020 (15:14 IST)
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జగమొండిగా మారారు. ఆ దేశ అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. అయినప్పటికీ.. ఈ ఓటమిని తాను అంగీకరించనని తెగేసి చెపుతున్నారు. పైగా, తనకు ఏడు కోట్ల పై చిలుకు లీగల్ ఓట్లు వచ్చాయని, అందువల్ల తానే విజయం సాధించానని ప్రకటించి, ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేశాడు. ఇలా మొండిగా వ్యవహరిస్తుండటంతో అమెరికా న్యాయ నిపుణులు సైతం తలలు పట్టుకుంటున్నారు. పైగా, మెలానియా కూడా అధ్యక్ష పీఠం నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ క్రమంలో తన భర్త డొనాల్డ్ ట్రంప్‌కు భార్య మెలానియా ట్రంప్ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘డెయిలీ మెయిల్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి చరమగీతం పాడేందుకు మెలానియా సిద్ధంగా ఉన్నారని, ఆ క్షణాల కోసం ఆమె ఎదురుచూస్తున్నారని పేర్కొంది.
 
ఈ మేరకు ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్‌ను ఉటంకిస్తూ కథనం రాసుకొచ్చింది. ట్రంప్, మెలానియాలు ఇద్దరూ ఒకరి అవసరాల కోసం మరొకరు కలిసి ఉన్నారని, నిజానికి వారి మధ్య భార్యాభర్తల బంధం లేనే లేదని ఒమరోసా చెప్పినట్టు పేర్కొంది. ట్రంప్‌కు విడాకులు ఇచ్చేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఈ విడాకుల విలువ 68 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.500 కోట్లుపైనే) ఉంటుందని అంచనా.
 
ట్రంప్, మెలానియాకు 14 ఏళ్ల కుమారుడు బారన్ ఉన్నాడు. కాబట్టి మెలానియాకు అందే ప్రాథమిక కస్టోడియల్ హక్కులన్నీ లభిస్తాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తన తొలి భార్యకు 14 మిలియన్ డాలర్లు, రెండో భార్యకు 2 మిలియన్ డాలర్లు భరణంగా ఇవ్వగా, మెలానియాతో విడాకులంటూ జరిగితే వారిద్దరి కంటే అత్యధికంగా 68 మిలియన్ డాలర్లు ఇచ్చుకోవలసి ఉంటుందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల్లో ఓట్లు చీల్చటానికి.. కీలక గుర్తులను పోలిన గుర్తులతో డమ్మీ అభ్యర్థులను పోటీకి పెడుతున్నారా?