Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య మెలానియా ట్రంప్ న్యూడ్ ఫోటోలు... నో ఫీలింగ్స్ అంటున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి

ప్రత్యర్థులను పూర్తి ఇరకాటంలో నెట్టేందుకు రాజకీయాల్లో ఏదైనా చేసేస్తారు. లూప్ హోల్స్... ఏమయినా ఉంటే వాటిని బయటపెట్టేందుకు ఇలాంటి సమయాల్లోనే వాడుకుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున నిలిచిన డోనాల్డ్ ట్రంప్ భార్య న్యూడ్ ఫోటోలు

Advertiesment
Donald Trump
, సోమవారం, 1 ఆగస్టు 2016 (19:36 IST)
ప్రత్యర్థులను పూర్తి ఇరకాటంలో నెట్టేందుకు రాజకీయాల్లో ఏదైనా చేసేస్తారు. లూప్ హోల్స్... ఏమయినా ఉంటే వాటిని బయటపెట్టేందుకు ఇలాంటి సమయాల్లోనే వాడుకుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున నిలిచిన డోనాల్డ్ ట్రంప్ భార్య న్యూడ్ ఫోటోలు ఇప్పుడు పత్రికల్లోనూ, నెట్లోనూ దర్శనమిస్తున్నాయి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే ట్రంప్‌కు.. ఆయనకు అదే రీతిలో సమాధానం చెప్పాలని భావించారో ఏమో కానీ.. ఆయన సొంత పార్టీకి చెందిన నేతలే ట్రంప్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ తీసే ప్రయత్నానికి తెర తీశారు.
 
 
ఎలాగంటే.. ట్రంప్ ప్రత్యర్థులకు తిరుగులేని అస్త్రంగా మారింది మరెవరో కాదు. ట్రంప్ సతీమణి.. సూపర్ మోడల్‌గా పేరున్న మెలానియా ట్రంప్‌ను వాడేయటానికి డిసైడ్ అయ్యారు. ఇప్పుడా ఫోటోల్ని సంపాదించిన ట్రంప్ ప్రత్యర్థులు.. ట్రంప్ సతీమని న్యూడ్ ఫోటోలను ప్రచారానికి తీసుకొచ్చారు. 1995లో మ్యానహట్టాన్‌లో మెలానియా ఓ ఫ్రెంచ్‌ మ్యాగజీన్‌ కోసం న్యూడ్‌ ఫొటోలు దిగారు ట్రంప్. ఫ్రెంచ్‌ ఫొటోగ్రాఫర్‌ అలే డీ బస్సేవిల్లే తీసిన ఫొటోలను న్యూయార్క్‌ పోస్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించి ప్రచురించడమే కాకుండా ఇలాంటి ఫిజిక్ ఉన్న మోడల్‌ను ఇప్పటివరకూ చూశారా అంటూ కామెంట్లు కూడా పెట్టేసింది. 
 
ఇకపోతే 45 ఏళ్ల మెలానియా నాలుగు భాషలు మాట్లాడగలిగిన నేర్పరి. అంతేకాదు స్టైల్ చిహ్నంగా ఆమెను పలువురు అభివర్ణిస్తారు. ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. వైట్ హౌస్ కి ఫస్ట్ లేడీ అయిన అత్యంత అందమైన వారిలో ఒకరిగా నిలుస్తారట. ఈమె ఖర్చు గురించి ప్రస్తావిస్తూ.. ట్రంప్‌ను వివాహమాడిన సమయంలో వెడ్డింగ్ గౌన్ కోసం ఆమె పెట్టిన ఖర్చు ఏకంగా 2లక్షల అమెరికా డాలర్లట. ఇలా మెలానియా గొప్పతనాన్ని కొందరు కీర్తిస్తుంటే.. మరోవైపు.. ఆమె న్యూడ్ ఫోటోలతో ట్రంప్‌ను దెబ్బ తీయాలని చేస్తున్న ప్రయత్నం ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది. అమెరికా ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాలి. ఐతే ట్రంప్ మాత్రం తన భార్య న్యూడ్ ఫోటోలు బయటకు రావడంపై నో ఫీలింగ్స్ అంటున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్, బీజేపీలు రెండూ నాటకాలాడుతున్నాయి... టీజీ వెంకటేష్ ఫైర్.....