ఆత్మహత్య చేసుకోవాలని ఓ వ్యక్తి 11 అంతస్తులు గల భవనంపై నుంచి కిందికి దూకాడు. కానీ ఆ వ్యక్తికి ఏ మాత్రం గాయం తగలకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన చైనాలోని జియంగ్జ్ నగరంలో జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని 11 అంతస్తులు గల భవనంపైకి ఎక్కాడు. కుటుంబ సభ్యులు, అధికారులు అతడిని కిందకు దించడానికి దాదాపు రెండు గంటలపాటు శ్రమించిన కూడా లాభం లేకపోయింది.
వెంటనే అధికారులు బిల్డింగ్ కింద ఎయిర్ కూషన్ ఏర్పాటు చేశారు. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి బిల్డింగ్‌పై నుండి ఒక్కసారిగా కిందకి దూకేశాడు. అయితే పోలీసులు కింద ఏర్పాటు ఎయిర్ కూషన్‌పైన పడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దాంతో అందరు బతుకుదేవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.