స్నేహితుడి భార్యనూ వదలని కాముకుడికి తప్పని కత్తిపోట్లు.. కోర్టూ వదల్లేదు
పదిహేనేళ్ల స్నేహం, కలిసి వ్యాపారం, మంచి స్థితి ఇవేవీ వారి మధ్య స్నేహాన్ని నిలపలేదు. కారణం స్నేహితుడి భార్యతో స్నేహితుడే సంబంధం పెట్టుకోవడం, పైగా సెల్ ఫోన్‌లో చిత్రీకరించడం. అతగాడి భార్య కూడా ఈ అక్రమ సంబంధానికి పూర్తిగా సహకరించి తాను కూడా ఫోటోలు తీ
పదిహేనేళ్ల స్నేహం, కలిసి వ్యాపారం, మంచి స్థితి ఇవేవీ వారి మధ్య స్నేహాన్ని నిలపలేదు. కారణం స్నేహితుడి భార్యతో స్నేహితుడే సంబంధం పెట్టుకోవడం, పైగా సెల్ ఫోన్‌లో చిత్రీకరించడం. అతగాడి భార్య కూడా ఈ అక్రమ సంబంధానికి పూర్తిగా సహకరించి తాను కూడా ఫోటోలు తీయడం. చివరకు వారి వ్యవహారం తెలుసుకున్న ఆ మోసపోయిన వ్యక్తి మిత్రద్రోహిని కత్తితో కుళ్లబొడిచాడు. న్యాయస్థానం కూడా అతడి చర్యను సమర్థించి మిత్రద్రోహానికి పాల్పడిన స్నేహితుడిని, అతడి భార్యను, బాధితుడి భార్యనుకూడా కటకటాల్లోకి పంపించింది.
స్నేహ భావనకే ద్రోహం తలపెట్టిన ఈ ఘాతుక చర్య అబుదాబీలో జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో మరో వ్యక్తి స్నేహం చేశాడు. ఇద్దరూ 15 సంవత్సరాలుగా యూఏఈలోని అబుదాబి నగరంలో నివాసముంటున్నారు. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్, ఓ ట్రాన్స్‌ఫోర్టు కంపెనీని నడుపుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఫిలిప్పైన్స్‌కు చెందిన మహిళలను పెళ్లి చేసుకున్నారు. రెండు జంటలూ నగరంలోని ఒకే అపార్టుమెంటులో నివాసం ఉంటున్నాయి.
ఒక రోజు బాత్‌రూంలో స్నానం చేస్తున్న స్నేహితుడి సెల్‌ఫోన్‌ని మరో మిత్రుడు తీసుకుని పరిశీలించాడు. దీంతో దిమ్మతిరిగే నిజం తెలిసింది. తన భార్యతో తన స్నేహితుడు సెక్స్‌లో పాల్గొన్న 4 వీడియోలు కనిపించాయి. తీవ్ర ఆగ్రహం చెందిన బాధితుడు బాత్‌రూం నుంచి బయటకు వచ్చిన స్నేహితుడిని కంటిపై పొడిచాడు. అనంతరం మెడ, ఇతర భాగాలపై పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాడు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు నిజాలను బయటపెట్టారు.
నిందిత వ్యక్తి స్నేహితుడి భార్యతో సెక్సులో పాల్గొంటున్న విషయం నిందితుడి భార్యకు కూడా తెలుసునని, ఆమె వీరిద్దరినీ సెల్‌ఫోన్లో చిత్రీకరించేదని, వాట్సాప్ ద్వారా వీడియోలు షేర్ చేసేదని విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో ముగ్గురూ దోషులేనని న్యాయస్థానం పేర్కొంది. నిందితుడు, ఇద్దరు ఫిలిప్పైన్ మహిళలకు మూడేళ్ల జైలుశిక్ష విధించింది.
ఇదిలావుండగా నిందితుడిని కత్తితో పొడిచిన స్నేహితుడిని కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. బాధిత వ్యక్తి ద్రోహం చేయడంతో ప్రతీకార దాహాంతో ఇలా చేశాడని సమర్ధించింది. ఈ ఘటన యూఏఈలోని అబుదాబి నగరంలో జరిగింది.