Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగారంలో దూకుడు... ఫ్రాక్చరైన పురుషాంగం... సర్జరీతో సరిచేసిన వైద్యులు...

చైనాకు చెందిన ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. తన భార్యతో విచ్చలవిడిగా శృంగారానికి ప్రయత్నించడమే కాకుండా.. పడక గదిలో దూకుడుగా ప్రవర్తించాడు. దీంతో అతని పురుషాంగం విరిగిపోయింది.

Advertiesment
శృంగారంలో దూకుడు... ఫ్రాక్చరైన పురుషాంగం... సర్జరీతో సరిచేసిన వైద్యులు...
, శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (10:12 IST)
చైనాకు చెందిన ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. తన భార్యతో విచ్చలవిడిగా శృంగారానికి ప్రయత్నించడమే కాకుండా.. పడక గదిలో దూకుడుగా ప్రవర్తించాడు. దీంతో అతని పురుషాంగం విరిగిపోయింది. ఫలితంగా భరించలేని నొప్పితో అల్లాడిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి వెళ్లేలోపు పురుషాంగం కాస్త నల్లగా కమిలిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తూర్పు చైనాలోని గ్వాంగ్జైకి చెందిన దాయ్ అనే 42 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి పడక గదిలో రెచ్చిపోయాడు. ఈ శృంగారం ఒకానొక దశలో హద్దుమీరడంతో ఏదో విరిగిన శబ్దం వచ్చింది. వెంటనే విపరీతమైన నొప్పితో అదికాస్తా వాచిపోయింది. పైగా, భరించలేని నొప్పి కలగడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. 
 
అతని పురుషాంగాన్ని పరిశీలించిన వైద్యులు... స్కానింగ్ చేయగా, కార్పొరా కావెర్నోసా అనే మృదు కణజాలం చీలిపోయినట్లు గుర్తించారు. అప్పటికే అది వాచిపోయింది. పురుషాంగానికి ఫ్రాక్చర్ అయినట్లుగా నిర్ధారించిన వైద్యులు వెంటనే సర్జరీ చేశారు.
 
దూకుడుగా సెక్స్ చేస్తున్నప్పుడు వేగంగా కదలడం వల్ల పురుషాంగంలోని రక్తనాళం పగిలిపోయి నొప్పి, వాపు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. 20-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరుగుతుంటుందని వారు చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏం కష్టమో.. నష్టమో... హైదరాబాద్‌లో యువ వైద్యురాలి బలవన్మరణం