Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండేళ్ల చిన్నారి ఐదో అంతస్థులో ఏసీ పట్టుకుని వేలాడాడు.. చివరికి..? (video)

రెండేళ్ల చిన్నారి ఐదో అంతస్థులో ఏసీ పట్టుకుని వేలాడాడు.. చివరికి..? (video)
, ఆదివారం, 19 జులై 2020 (12:39 IST)
Boy
ఐదో అంతస్తు నుంచి జారి పడిన చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జుయీలోని ఐదు అంతస్థుల భవనం వుంది. ఈ భవనానికి చెందిన ఐదో అంతస్థులో ఉన్న బెడ్‌రూంలో ఆ రెండేళ్ల వయసున్న చిన్నారి ఆడుకుంటున్నాడు. 
 
అలా కాసేపటికి తర్వాత గోడకు వున్న కిటీకీని ఎక్కాడు. ఆ కిటికీ కాస్త తెరుచుకోవడంతో.. బయటకు చూశాడు. బయట బావుంది అనుకుంటూ... కిటికీ నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో చిన్నారి తప్ప ఎవరూ లేరు. అటు నుంచి బయటకు రాకూడదని తెలియని ఆ చిన్నారి బయటకు వచ్చేశాడు.
 
అక్కడి ఎయిర్ కండీషనింగ్ యూనిట్లను పట్టుకొని వేలాడాడు. కొంతసేపు అలానే వేలాడు. చివరికి పట్టుకోల్పోయాడు. అక్కడి నుంచి కిందకి జారిపడ్డాడు. కానీ అప్పటికే పక్కింటి లీ ఆ చిన్నారని గమనించారు. ఓ దుప్పటిని చిన్నారి పడే చోట సెట్ చేశాడు. అంతేకాదు తనతోపాటూ మరో ముగ్గుర్ని కూడా అక్కడ రెడీ చేశాడు. ఆ చిన్నారి కింద పడుతూ లీ దెహాయ్ చేతుల్లోకి జారాడు. 
 
మొత్తానికి చిన్నారి ప్రాణాలను లీ కాపాడారు. ఈ ఘటనలో లీ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు... అతనికి అవార్డ్ ప్రకటించారు. ఈ ఘటనలో లీ ఏమాత్రం ఆలస్యంగా స్పందించినా చిన్నారి ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. అందరూ లీని మెచ్చుకుంటున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్యలో భూమిపూజకు మోదీ.. ఆగస్టు 5న ముహూర్తం ఖరారు