రూ.668 కోట్ల పసిడి విమానం... నోరెళ్లబెట్టిన పెర్త్ వాసులు
మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు.
మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు. ఈ విమానంలో ఇస్మాయిల్ ఆయన భార్య జారీత్ సోఫియాతో కలిసి విహారయాత్రకు వచ్చారు. పెర్త్ నగరంలో ఆయనకు రూ.43 కోట్ల విలువ చేసే విలాసవంతమైన భవంతి కూడా ఉంది.
కాగా, ఈ బంగారపు విమానం ఖరీదు సుమారు రూ.668 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఉంటుందన్నారు. బోయింగ్ 737 చెందిన ఈ విమానంలో విలాసవంతమైన సదుపాయాలున్నాయి. డైనింగ్ రూము, బెడ్ రూము, షవర్, మూడు వంట గదులు ఇందులో ఉన్నాయి. సుల్తాన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాన్ని తయారు చేయడానికి రెండేళ్లు పట్టింది.