Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుమత్రాదీవుల్లో తీవ్ర భూకంపం.. రిక్టార్ స్కేలుపై 6.4గా నమోదు.. 20 మంది మృతి

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని

Advertiesment
Magnitude 6.5 earthquake hits near Banda Aceh
, బుధవారం, 7 డిశెంబరు 2016 (10:18 IST)
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ కూడా ధ్రువీకరించింది. ఈ ఘటనలో అనేక మంది గాయాల పాలైనట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు
 
కాగా, ఇప్పటికైతే ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. భూకంపకేంద్ర ప్రాంతానికి దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు. ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎటువంటి సునామీ ముప్పులేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
 
2004లో ఆసె ప్రాంతంలో ఒకసారి సునామీ వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో దాదాపు 30మీటర్ల ఎత్తున భారీ అలలు విరుచుకుపడటంతో దాదాపు 1,70,000 మంది చనిపోయినట్లు గణాంకాలు చెప్తున్నారు. ఇంకా ఈ సునామీలో భారత్‌లో 8వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేతిలో పెడితే.. పన్నీర్ సెల్వంకు కష్టమే: స్వామి