బ్రేకప్ అయిన ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఓ గ్రూపును ఏర్పాటు చేశామని, ఈ గ్రూప్ కోసం రూ.33 కోట్లు వెచ్చించామని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రేమలో పడిన యువతీ యువకులు లవ్ ఫెయిల్యూర్ కారణంగా గుండెలు బాదుకోవడం, కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
ఈ పరిస్థితిలో ప్రేమలో విఫలమైన యువతీ యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం లవ్ బెటర్ అనే ప్రచార బృందాన్ని కివీస్ సర్కారు ప్రారంభించింది.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించింది. ప్రేమలో విఫలమైన వారు కోలుకునేలా సలహాలు ఇస్తూ.. వారిని బ్రేకప్ బాధ నుంచి గట్టెక్కేలా ఈ బృందం చేస్తుంది. న్యూజిలాండ్ ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు.