పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇందులో పౌరులు, సైనికులు మరణిస్తున్నారు. గత నెలలో జరిగిన దాడిలో 12 మంది పాక్ సైనికులు మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని అధికార తాలిబాన్ సంస్థకు చెందిన తెహ్రిక్-యే-తాలిబాన్ పాకిస్థాన్, పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో పాకిస్థాన్‌పై దాడులు చేస్తోందని వార్తలు వచ్చాయి.
అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. కానీ అది జరగలేదు. పాకిస్థాన్ ఇలాంటి దాడులను ఎప్పటికీ సహించదు. దానికి తగిన సమాధానం చెబుతుందని పాకిస్తాన్ హెచ్చరించింది. దీనిపై ఆఫ్ఘానిస్థాన్ పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించింది.
తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ దీనిపై మాట్లాడుతూ.. "మేము ఎప్పుడూ మా మట్టిని ఉగ్రవాదానికి ఉపయోగించలేదు. పాకిస్తాన్‌లో మాత్రమే ఉగ్రవాదం ఎందుకు పెరుగుతోంది? బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఖర్చు చేసినప్పటికీ ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో పాకిస్తాన్ ఎందుకు విఫలమైంది? పాకిస్తాన్ ఆ పని చేయాలి. మమ్మల్ని నిందించకుండా దాని స్వంత దేశంలోనే అందుకు తగిన సమాధానం వెతకాలి." అని సరైన కౌంటరిచ్చారు.