అనుమతిస్తే జైల్లో శృంగారం చేసుకుంటామంటున్న ఖైదీ... అతని కోర్కెకు భారీగా మద్దతు...
శృంగారం లేకుండా వుంటే మనిషి పిచ్చివాడయిపోతాడని కొందరు వాదిస్తుంటారు. ఇలాంటి వాదననే ఓ సీనియర్ ఖైదీ వాదిస్తున్నాడు. జైల్లో ఒంటరిగా కాలం గడిపితే ఖైదీలో మార్పు వచ్చే మాట అటుంచి అతడు మరీ మానసికంగా కుంగిపోత
శృంగారం లేకుండా వుంటే మనిషి పిచ్చివాడయిపోతాడని కొందరు వాదిస్తుంటారు. ఇలాంటి వాదననే ఓ సీనియర్ ఖైదీ వాదిస్తున్నాడు. జైల్లో ఒంటరిగా కాలం గడిపితే ఖైదీలో మార్పు వచ్చే మాట అటుంచి అతడు మరీ మానసికంగా కుంగిపోతాడని అంటున్నాడు. అందుకే జైల్లో శృంగార కార్యక్రమం చేసుకునేందుకు వీలుగా సెక్స్ డాల్ కొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ జైళ్ల శాఖకు విన్నవించాడు. వివరాల్లోకి వెళితే... లండన్‌లో జాక్ స్వారేజ్ అనే తీవ్రనేరానికి పాల్పడి నాటింగ్‌హోమ్ షైర్‌లోని లోథమ్ గ్రేగ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
జైలులో పరిస్థితి గమనించిన అతడు తన మనసులోని ఓ విషయాన్ని జైళ్ల శాఖకు చెందిన వెబ్ సైట్లో ఓ విజ్ఞప్తిని చేశాడు. జైళ్లలో శృంగార కార్యకలాపాలు సాగించేందుకు అధికారులు అనుమతించాలని కోరాడు. దీనికి జైళ్ల శాఖ అదనంగా చేయాల్సిందేమీ లేదనీ, ఖైదీలు సంపాదించిన డబ్బుతోనే సెక్స్ డాల్స్ కొనుక్కుని వాటితో ఆ సుఖాన్ని తీర్చుకుంటారని పేర్కొన్నాడు.
తద్వారా అతడి ప్రవర్తనలో మార్పు రావడమే కాకుండా మానసికంగా కుంగిపోకుండా వుంటాడని చెప్పుకొచ్చాడు. దీనిపై ఖైదీల నుంచి భారీ మద్దతు లభించగా, అనూహ్యంగా బయట నుంచి కూడా మద్దతు వస్తోంది. ఐతే జైళ్ల శాఖ మాత్రం దీనిపై స్పందించలేదు.