లండన్ యాసిడ్ దాడి... టాప్ మోడల్‌కు అక్కడ కాలింది... ప్రియుడి ఫోటోను తొలగించిన ప్రేయసి...
యాసిడ్ దాడితో సోమవారం నాడు లండన్‌లోని మాన్‌గ్లే నైట్‌క్లబ్‌లో ఆర్థర్ కొల్లిన్స్ సృష్టించిన బీభత్సంలో సుమారు 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్ కూడా వుంది. కాగా ఆర్థర్ కోసం పోలీసు
యాసిడ్ దాడితో సోమవారం నాడు లండన్‌లోని మాన్‌గ్లే నైట్‌క్లబ్‌లో ఆర్థర్ కొల్లిన్స్ సృష్టించిన బీభత్సంలో సుమారు 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్ కూడా వుంది. కాగా ఆర్థర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యాసిడ్ దాడి చేసిన తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఐతే అతడి ఫోటోను ప్రియురాలు ఫెర్నె తన ఇన్‌స్టాగ్రాంలో పెట్టుకుని వుండటంతో పోలీసులు ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి అతడి ఫోటోను తొలగించింది.
కాగా ఈస్టర్ పండుగ సందర్భంగా లండన్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్థర్ ఈ దాడి చేశాడు. ఈ యాసిడ్ దాడిలో ప్రముఖ ఆస్ట్రేలియా మోడల్ ఫ్రేసర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె చేతులపైన, వీపు పైన యాసిడ్ పడటంతో గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా లండన్‌లో ఇటీవల కాలంలో యాసిడ్ దాడులు గణనీయంగా పెరుగుతూ పోతున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకూ దాదాపు 1800 దాడులు జరుగగా ఒక్క 2016లోనే 454 యాసిడ్ దాడులు జరగడం గమనార్హం.