గురుగ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన జునో... వీడనున్న గురు గ్రహ గుట్టు!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు పదేళ్ల కిందట ప్రయోగించిన జునో వ్యోమనౌక మంగళవారం విజయవంతంగా గురుగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు పదేళ్ల కిందట ప్రయోగించిన జునో వ్యోమనౌక మంగళవారం విజయవంతంగా గురుగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. జునో పురోగతిని కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలోని డీప్ స్పేస్ నెట్‌వర్క్ యాంటెన్నాల ద్వారా శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు.
ఇందులో ఇంజిన్ ప్రజ్వలన పూర్తయ్యాక జునో... గురు గ్రహం చుట్టూ తిరగడం ప్రారంభిస్తుంది. ఈ కీలక ఘట్టం కోసం శాస్త్రవేత్తలు వూపిరి బిగబట్టి ఎదురు చూశారు. ఈ ప్రయోగం ద్వారా సౌర కుటుంబంలోని అతి పెద్ద గ్రహం గురుడికి సబంధించిన గుట్టుమట్లు వీడ నున్నాయి. ముఖ్యంగా గురు గ్రహం పుట్టుక, నిర్మాణం, వాతావరణం, అయస్కాంతక్షేత్రం వంటి అంశాలు దీనిద్వారా తేలుతాయని నాసా భావిస్తోంది.