Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీవీలో రాజకీయ నేత ఏడుస్తుంటే.. ఆ పాప కర్చీఫ్ తీసుకుని కన్నీళ్ళు తుడిచింది..!

పిల్లల బుడిబుడి నడకలూ, ముద్దు ముద్దు మాటలూ... ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే వారు చేసే అల్లరి పనులు కూడా అంతే అందంగా ఉంటాయి. మరి ఈ చిన్నారి చేసిన పనిని చూస్తే నవ్వురావడం ఒకపక్క.. మరో పక్క ఆ చిన్నా

టీవీలో రాజకీయ నేత ఏడుస్తుంటే.. ఆ పాప కర్చీఫ్ తీసుకుని కన్నీళ్ళు తుడిచింది..!
, శుక్రవారం, 15 జులై 2016 (12:17 IST)
పిల్లల బుడిబుడి నడకలూ, ముద్దు ముద్దు మాటలూ... ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే వారు చేసే అల్లరి పనులు కూడా అంతే అందంగా ఉంటాయి. మరి ఈ చిన్నారి చేసిన పనిని చూస్తే నవ్వురావడం ఒకపక్క.. మరో పక్క ఆ చిన్నారిని ముద్దు పెట్టుకుంటారు. అసలు విషయం ఏంటంటే... జపాన్‌లో ఉండే ఓ పాప టీవీలో వస్తున్న ఓ ఇంటర్య్వూలో రాజకీయ నాయకుడు ఏడుస్తూ కనిపించాడు. 
 
ఆ పాపకి ఏం అనిపించిందో ఏమోగానీ... వెంటనే తాను ఏడిస్తే అమ్మ ఏం చేస్తుందో అలాగే చేసింది. ఓ కర్చీఫ్ తీసుకుని పరిగెట్టుకుని టీవీ దగ్గరికి వెళ్లి ఆ నాయకుడి కన్నీళ్లు తుడిచింది. పాప చేసిన ఈ కార్యాన్ని తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు కొన్ని వేల లైక్‌లు వచ్చి పడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నర్సును లొంగదీసుకున్నాడు.. వాడుకున్నాడు.. ఆపై పెళ్లి చేసుకోనన్నాడు.. ఆపై ఏమైంది?