Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూరీ ఘటన మా పాపమే.. లష్కరే తోయిబా.. పోస్టర్లే సాక్ష్యం.. పాకిస్థాన్‌కు షాక్..

యూరీ ఘటన మా పాపం కాదని ఇన్నాళ్లు బుకాయిస్తున్న పాకిస్థాన్ అడ్డంగా బుక్ అయ్యింది. యూరీ ఘటనలో 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. లష్కరే తోయిబా సంస్థ యూరీ ఘటనకు బాధ్యత వహించింది. యూరీ ఘట

యూరీ ఘటన మా పాపమే.. లష్కరే తోయిబా.. పోస్టర్లే సాక్ష్యం.. పాకిస్థాన్‌కు షాక్..
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (18:01 IST)
యూరీ ఘటన మా పాపం కాదని ఇన్నాళ్లు బుకాయిస్తున్న పాకిస్థాన్ అడ్డంగా బుక్ అయ్యింది. యూరీ ఘటనలో 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. లష్కరే తోయిబా సంస్థ యూరీ ఘటనకు బాధ్యత వహించింది. యూరీ ఘటనకు పాల్పడింది తామేనని ప్రకటించింది. ఇందుకు పాకిస్తాన్‌ పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలాలో వెలసిన పోస్టర్లే ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. 
 
యూరీ దాడిలో హతమైన లష్కరే ఉగ్రవాది ముహమ్మద్ అనాస్ అలియాస్ అబూ సరఖా అంతక్రియల సందర్భంగా జరిగే ప్రార్థనలకు జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ హాజరుకానున్నట్టు సదరు పోస్టర్లో పేర్కొన్నారు. ఉర్దూలో రాసి ఉన్న ఈ పోస్టర్‌లో లష్కరే తోయిబా జరిపిన దాడిలో 177 మంది భారత సైనికులను హతమార్చినట్లు క్లెయిమ్ చేసుకున్నారు. ఈ దాడిలో అమరుడైన అనాస్ మృతదేహం లేకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
గుజ్రాన్‌వాలా పట్టణంలోని సదబహర్ నర్సరీ వద్ద అంత్యక్రియలు జరపనున్నట్టు తెలిపారు. ఉరీ దాడి పాక్ ఉగ్రవాదుల పనేనని, ఉగ్రవాదుల స్వర్గధామంగా పాకిస్తాన్ నిలిస్తోందని భారత్ ఎండగట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపైనా పాకిస్థాన్‌ను ఒంటరి చేసే ప్రయత్నాలను భారత్ చేపట్టిందని పాక్ ఆరోపణలు చేసింది. 
 
కానీ తాజాగా లష్కరే పోస్టర్లు గుజ్రాన్‌వాలాలో పోస్టర్లు వెలవడం, ఉరీ దాడి తమపనేనని, దాడిలో 117 మంది భారత సైనికులను పొట్టనపొట్టుకున్న 'పోరాట యోధుడు' అనాస్ అని పొడుగుతూ పోస్టర్లు వెలవడంతో పాక్ ఇరకాటంలో పడినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది జరిగితే మిషెల్లీ విడాకులివ్వడం ఖాయం.. ట్రంప్‌ని టీవీల్లో చూసి నవ్వుకున్నా: ఒబామా