Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అది జరిగితే మిషెల్లీ విడాకులివ్వడం ఖాయం.. ట్రంప్‌ని టీవీల్లో చూసి నవ్వుకున్నా: ఒబామా

అమెరికా అధ్యక్ష పదవికి రెండుసార్లు మాత్రమే అవకాశమున్నప్పటికీ.. మూడోసారి అవకాశం కల్పిస్తే.. మళ్లీ అధ్యక్ష పోటీలోకి దిగేవారా? అనే ప్రశ్నకు ఒబామా సరదా కామెంట్స్ చేశారు. మరోసారి రాజకీయాల్లోకి దిగితే తన భా

అది జరిగితే మిషెల్లీ విడాకులివ్వడం ఖాయం.. ట్రంప్‌ని టీవీల్లో చూసి నవ్వుకున్నా: ఒబామా
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (17:39 IST)
అమెరికా అధ్యక్ష పదవికి రెండుసార్లు మాత్రమే అవకాశమున్నప్పటికీ.. మూడోసారి అవకాశం కల్పిస్తే.. మళ్లీ అధ్యక్ష పోటీలోకి దిగేవారా? అనే ప్రశ్నకు ఒబామా సరదా కామెంట్స్ చేశారు. మరోసారి రాజకీయాల్లోకి దిగితే తన భార్య (మిషెల్లీ) విడాకులు ఇచ్చేయడం ఖాయమన్నారు. ఓ లైవ్ షోలో ఒబామా మాట్లాడుతూ..  ట్రంప్‌పై పలు సెటైర్లు వేశారు. నవంబర్ 8న జరిగే ఎన్నికల్లో రిగ్గింగ్ జరగబోతోందనే ట్రంప్ ఆరోపణలను ఒబామా ధీటుగా తిప్పికొట్టారు.  
 
ఇటీవల తెల్లవారు జామున మూడు గంటలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణల పట్ల ట్విట్టర్ ద్వారా ట్రంప్ స్పందించిన విషయాన్ని ఒబామా ఎద్దేవా చేశారు. తనను అవమానించిన వారి గురించైనా సరే తెల్లవారుజామున 3 గంటలకు తాను ట్వీట్‌ చేయనని ఒబామా వ్యాఖ్యానించారు. టీవీలో ట్రంప్‌ని చూసి చాలాసార్లు నవ్వానని.. మూడు, నాలుగు సందర్భాల్లో రాత్రిపూట నిద్రలో ఉన్న సమయంలోను తాను ఫోన్ కాల్స్ తీసుకుంటానని, కానీ ట్రంప్ స్మార్ట్ ఫోన్ మాత్రం పగటిపూట కూడా కనెక్ట్ కాదని ఎద్దేవా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తే నా భార్య విడాకులు ఇస్తానంది : బరాక్ ఒబామా