భారత్-బంగ్లా సరిహద్దుల్లోనూ లేజర్ గోడలు, స్మార్ట్ సెన్సార్ల నిర్మాణం..
దాయాది దేశమైన పాకిస్థాన్ సరిహద్దు భారత్-పాక్ సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట నేపథ్యంలో.. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దులో కొన్ని చోట్ల లేజర్ గోడలను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలనే ఇస్తున్
దాయాది దేశమైన పాకిస్థాన్ సరిహద్దు భారత్-పాక్ సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట నేపథ్యంలో.. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దులో కొన్ని చోట్ల లేజర్ గోడలను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలనే ఇస్తున్నారు. ఇదే తరహాలో భారత్-బంగ్లా సరిహద్దుల్లోనూ లేజర్ గోడల నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది.
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అనునిత్యం చొరబాట్లు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఎందరో బంగ్లాదేశీయులు చట్ట విరుద్ధంగా భారత్‌లో నివసిస్తున్నారు. దీంతో, ఈ చొరబాట్లకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్ గోడలను, స్మార్ట్ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది. సరిహద్దులోని నదీతీర ప్రాంతాలలోను, కంచెను నిర్మించలేని ప్రాంతాలలోను ఈ గోడలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.