Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

krish arora

ఠాగూర్

, సోమవారం, 2 డిశెంబరు 2024 (11:15 IST)
బ్రిటన్ దేశానికి చెందిన భారత సంతతికి చెందిన క్రిష్ అరారో అనే 12 యేళ్ళ కుర్రోడు ఇంటెలిజెన్స్ కోషెంట్ (ఐక్యూ)లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలైన అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ను మించిపోయాడు. పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌కు చెందిన క్రిష్.. గణితం నుంచి సంగీతం వరకు అన్ని రంగాల్లోనూ అత్యంత జీనియస్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐక్యూ టెస్టులో 162 స్కోరు సాధించాడు. ఈ క్రమంలో తన హీరోగా చెప్పుకునే ఐన్‌స్టీన్ కంటే రెండు మార్కులు ఎక్కువే సాధించడం గమనార్హం.
 
క్రిష్ తన మేథతో అత్యంత ఐక్యూ కలిగిన వారికి మాత్రమే పరిమితమైన 'మేన్సా సొసైటీ'లో సభ్యత్వం సాధించాడు. నాలుగేళ్ల వయసులోనే గణిత పుస్తకాన్ని మూడు గంటల్లో పూర్తిచేసిన క్రిష్.. 8 ఏళ్ల వయసులో తన క్లాస్ సబ్జెక్టులను ఒక్క రోజులోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు. 11 ప్లస్ ఎగ్జామ్స్ చాలా ఈజీ అన్న ఈ కుర్రాడు తనకు స్కూలుకు వెళ్లాలని అనిపించదని, అక్కడ చిన్న చిన్న వాక్యాలు, చిన్నచిన్న లెక్కలు చేయడంతోనే సరిపోతోందని వాపోయాడు.
 
ఆల్జీబ్రా అంటే ఎంతో ఇష్టమన్న క్రిష్ వచ్చే యేడాది సెప్టెంబరులో లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్ స్కూల్లో చేరనున్నాడు. చెస్‌లోనూ అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నాడు. కుమారుడికి చదరంగం నేర్పించేందుకు చెస్లోనూ టీచర్‌ను పెడితే అతడినే ఓడించాడని ఆయన తండ్రి నిశ్చల్ ఆశ్చర్యంతో వెల్లడించాడు. పియానోలో రెండేళ్లలోనే మాస్టర్ అయిపోయాడు. ఆరు నెలల్లోనే నాలుగు గ్రేడ్లు సాధించి ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలోని 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు సంపాదించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్