Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

మోడల్ 'ప్రైవేట్' భాగాలను తమలపాకు.. కుంకుమ భరణితో దాచి...

ఓ ఫోటోగ్రాఫర్‌కు అందరు తీసేలాకాకుండా, కళాత్మకంగా ఫోటోలు తీయాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఓ మోడల్‌ను సంప్రదించాడు. ఆమెతో తన మెదడులోని ఆలోచనలు పంచుకున్నాడు.

Advertiesment
Kolkata photographer
, ఆదివారం, 26 ఆగస్టు 2018 (10:28 IST)
ఓ ఫోటోగ్రాఫర్‌కు అందరు తీసేలాకాకుండా, కళాత్మకంగా ఫోటోలు తీయాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఓ మోడల్‌ను సంప్రదించాడు. ఆమెతో తన మెదడులోని ఆలోచనలు పంచుకున్నాడు. ఆ విధంగా ఫోటోలకు ఫోజులిచ్చేందుకు సమ్మతించింది. దీంతో తాను అనుకున్నట్టుగానే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇపుడు ఈ ఫోటోలే అతని ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బెంగాల్‌కు చెందిన ప్రీతమ్‌ మిత్రా అనే ఫోటోగ్రాఫర్... కళాత్మకంగా ఫోటోలు తీయాలని భావించాడు. ఆ మోడల్‌ను పెళ్లికుమార్తెలా నుదుట పెద్ద బొట్టు పెట్టి నగ్నంగా ఫొటోలు తీశాడు. పైగా ఆమె తలపై బెంగాలీ వధువులు ధరించే కిరీటం.. ఒక చేతిలో తమలపాకులతో ముఖాన్ని, మరో చేత్తో ప్రైవేటు భాగాలు కనిపించకుండా కుంకుమ భరణి అడ్డుపెట్టి ఫొటో తీశాడు. 
 
ఆ తర్వాత ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఇప్పుడా వైవిధ్యమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. కళాత్మకత ఏమో కానీ.. మతపరమైన సంప్రదాయాలను దెబ్బతీశాడంటూ బెదిరింపులు మొదలయ్యాయి. 24 గంటల్లో ఫొటో తొలగించకుంటే చంపేస్తామంటూ అతనికి ఫోన్‌ చేసి మరీ హెచ్చరిస్తున్నారు. వారం రోజులుగా వస్తున్న బెదిరింపులతో భయపడిన ప్రీతమ్‌.. పోలీసులను ఆశ్రయించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాళ్లు కట్టేసి.. ముఖానికి కవర్ చుట్టి.. మత్తు ఇంజెక్షన్ వేసి.. బ్యూటీషియన్‌పై అత్యాచారం?