Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరాచీ గగనతలంలో విమాన రాకపోకలపై నిషేధాజ్ఞలు... పాక్ కీలక నిర్ణయం

యూరీ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ఓడరేవు పట్టణమైన కరాచీ గగనతలంపై విమానరాకపోకలను పూర్తిగా

Advertiesment
కరాచీ గగనతలంలో విమాన రాకపోకలపై నిషేధాజ్ఞలు... పాక్ కీలక నిర్ణయం
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:41 IST)
యూరీ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ఓడరేవు పట్టణమైన కరాచీ గగనతలంపై విమానరాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. పాక్ సర్కారు నోటామ్ (నోటీస్ టు ఎయిర్ మెన్) విడుదల చేస్తూ, కరాచీ గగనతలంపై 33 వేల అడుగులకన్నా తక్కువ ఎత్తులో విమాన ప్రయాణాలు నిషేధమని తెలిపింది. కరాచీ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (ఎఫ్ఐఆర్) సేవలు అందవని తెలిపింది. 
 
కాగా, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులకు కూతవేటు దూరంలోనే ఉండే కరాచీ నగరంపై నుంచి ఎన్నో విమానాలు వెళుతుంటాయి. నాగపూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చే సర్వీసులన్నీ ఇదే మార్గంలో ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఇవన్నీ ఏదో ఒకదశలో కరాచీ ఎఫ్ఐఆర్‌తో సంబంధాన్ని కొనసాగిస్తాయి. ఇక కరాచీ అందుబాటులో లేని వేళ, ఢిల్లీ ఎఫ్ఐఆర్ పరిధిలోకి వచ్చే ముందు ఇరాన్, ఆప్ఘనిస్థాన్‌లోని ఎయిర్ పోర్టుల్లోని ఎఫ్ఐఆర్‌లతో సంబంధం పెట్టుకోవాల్సి వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో ఆపరేషన్‌ ఎలిఫెంట్‌ స్టార్ట్...