Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డోనాల్డ్ ట్రంప్ ఓ పంది, కుక్క... పనికిమాలిన ఎద్దు : హాలీవుడ్ నటుడు రాబర్ట్ డే

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తుండే కొద్దీ.. ఈ పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై వ్యతిరేకతతో పాటు.. విమర్శలు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

Advertiesment
Jon Voight
, ఆదివారం, 9 అక్టోబరు 2016 (10:38 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తుండే కొద్దీ.. ఈ పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై వ్యతిరేకతతో పాటు.. విమర్శలు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 
 
ముఖ్యంగా ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డే నీరో ట్రంప్పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ట్రంప్ ఓ పంది, ఓ కుక్క, పనికిమాలిన ఎద్దు ఇంకా చాలా అంటూ ఆయన ఓ వీడియో సందేశంలో చెప్పారు. అతడొక జాతీయ విపత్తులాంటివారంటూ ఆరోపించారు.
 
ట్రంప్ విషయమే తనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోందని, అసలు ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడో అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రంప్ ముక్కుమీద ఒక్కసారి గట్టిగా ఒక పంచ్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పాడు. అంతకుముందు కూడా ట్రంప్ ఓ ట్యాక్సీ డ్రైవర్ లాంటి వాడంటూ విమర్శించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాకు బీజేపీ వార్నింగ్ : మేము కావాలో పాకిస్థాన్ కావాలో తేల్చుకోండి