వయసు మీదపడుతున్నా... జపాన్‌లో యువతులు కన్యత్వాన్ని కోల్పోవడం లేదట?
జపాన్ దేశంలో కన్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందట. వయసు మీదపడుతున్నా.. వారు మాత్రం తమ కన్యత్వాన్ని కోల్పోవడం లేదట. దీనిపై ఆ దేశ ప్రభుత్వం ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. ఈ మాట వినడానికి విచిత్రంగా ఉన్నప
జపాన్ దేశంలో కన్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందట. వయసు మీదపడుతున్నా.. వారు మాత్రం తమ కన్యత్వాన్ని కోల్పోవడం లేదట. దీనిపై ఆ దేశ ప్రభుత్వం ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. ఈ మాట వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం.
జపాన్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 18-34 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకుల్లో 70 శాతం మంది యువకులు బ్రహ్మచారులుగా కాగా 60 శాతం మంది మహిళలు పెళ్లికి దూరంగా ఉన్నారు.
అంతేకాదు పురుషులతో వారు ఎటువంటి 'బంధా'లు ఏర్పరచుకోకపోవడం గమనార్హం. మరింత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. 42 శాతం మంది పురుషులు, 44.2 శాతం మంది మహిళలు.. ఇంకా తాము కన్యత్వాన్ని కోల్పోలేదని ఈ సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు.
ఇదే జరిగితే దేశంలో వయసు మీరుతున్నవారి సంఖ్య పెరిగిపోతుండగా జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఇదిఇలాగే కొనసాగితే వృద్ధ దేశంగా మారిపోయే ప్రమాదముందని భయపడుతోంది. దీంతో పెళ్లి చేసుకునేందుకు, పిల్లల పెంపకానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది.