జపాన్ దేశం మరోమారు వణికిపోయింది. గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. జపాన్ రాజధాని టోక్యోలోని చిబా ఫ్రిఫెక్చర్‌లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది.
టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్‌లో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని వాతావరణ సంస్థ తెలిపింది. ఈ భూకంప ప్రభావంతో అనేక భవనాలు కాసేపు ఊగాయి. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కొన్ని కార్యాలయాల పైకప్పు భవనాలకు మాత్రం పగుళ్లు ఏర్పడ్డాయి.
అదేసమయంలో ఈ భూకంపం ప్రభావం కారణంగా సునామీ వంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. అదేసమయంలో టోక్యో నగరానికి వచ్చే అన్ని రైళ్లను నగరం బయటే నిలిపివేశారు.