Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జపాన్‌లో బియ్యం కొరత... షాపుల ముందు నో స్టాక్ బోర్డులు!!

basmati rice

ఠాగూర్

, శుక్రవారం, 30 ఆగస్టు 2024 (08:59 IST)
జపాన్ దేశాన్ని బియ్యం కొరత వేధిస్తుంది. నిజానికి జపాన్ వరుస తుఫాన్లతో అతలాకుతలమైపోతుంది. ఈ తుఫాన్ల బారి నుంచి తప్పించుకునేందుకు జపాన్ ప్రజలు నానా తిప్పలు పడుతుంటారు. ఇపుడు బియ్యం కొరత కూడా తలెత్తింది. దీనికి కారణం లేకపోలేదు. జపాన్‌ దేశాన్ని ఓ భారీ భూకంపం వణికించనుందని, వరుసు తఫాను విరుచుకుపడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. దీంతో జపాన్ ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా భారీ మొత్తంలో నిత్యావసర వస్తు సరకులను కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ఈ కారణంగా కిరాణా షాపుల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల కొరత ఏర్పడింది. 
 
ఆ దేశ వ్యాప్తంగా ప్రతి సూపర్ మార్కెట్‌ ఎదుట నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. రోజువారీగా తెప్పించిన బియ్యం స్టాక్ మధ్యాహ్నానికే ఖాళీ అవుతోంది. మార్కెట్లో బియ్యం కొరత ఏర్పడిందనే వార్తలతో జపాన్ వాసులు ఆందోళనలతో సూపర్ మార్కెట్లకు పోటెత్తుతున్నారు. బియ్యం కోసం క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సూపర్ మార్కెట్లు, షాపుల యజమానులు బియ్యం కొనుగోలుపై రేషన్ విధించారు. ఒక కుటుంబానికి రోజుకు ఒక రైస్ బ్యాగ్ మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకున్నారు.
 
ఈ యేడాది జపాన్‌ దేశంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సరిపడా నీరు లేక వరి సాగు తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో సహజంగానే బియ్యం కొరత ఏర్పడింది. దీనికితోడు ఇటీవలి వరుస భూకంపాల నేపథ్యంలో భారీ భూకంపం రానుందని సైంటిస్టులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. మరోవైపు తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. వీటన్నింటి ఫలితంగా నిత్యావసర వస్తువులకు డిమాండ్ ఏర్పడింది. బియ్యం సహా ఇతరత్రా రోజువారీ అవసరాల కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నారు. ప్రజల ముందుజాగ్రత్త చర్యల కారణంగా మార్కెట్లో బియ్యానికి కొరత మరింత పెరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు..