Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గని కార్మికులపై బురద పంజా : 103 మంది మృత్యువాత

గని కార్మికులపై బురద పంజా : 103 మంది మృత్యువాత
, గురువారం, 2 జులై 2020 (16:43 IST)
మయన్మార్‌లో విషాదం జరిగింది. గనిలో పని చేసే కార్మికులపై బురద పంజా విసిరింది. ఈ ప్రమాదంలో 103 మంది మృత్యువాతపడినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం మయన్మార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాచిన్ రాష్ట్రంలోని వర్షాలకు భారీ ప్రమాదం జరగడంతో రంగురాళ్ల గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 103 మంది మృత్యువాత పడ్డారు. 
 
కొండలా పేరుకుపోయిన మైనింగ్ వ్యర్థాలు భారీవర్షం కారణంగా దిగువన ఉన్న సరస్సులో పడ్డాయి. దాంతో సరస్సులోని నీరు ఉప్పొంగి సమీపంలో ఉన్న గనులను ముంచెత్తింది. దాంతో కార్మికులు ఆ బురదనీటిలో ఉక్కిరిబిక్కిరై మృతి చెందారు. 
 
ప్రస్తుతం అక్కడ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదేళ్ల కిందట కూడా కాచిన్ రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే జరగ్గా వంద మందికిపైగా మరణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేద విద్యార్థులకు బరువైన ఆన్లైన్ విద్య