Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మా నాన్న.. నాతో డేటింగ్' చేశారా?.. డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కుమార్తె స్పందన

"నేను మరో 20 యేళ్ల తర్వాత పుట్టి ఉంటే... నా కూతురితో ఖచ్చితంగా డేటింగ్ చేసేవాడిని" అంటూ 2008లో ఆయన చేసిన వ్యాఖ్యలను ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. దీనిపై డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా స్పందించారు.

Advertiesment
Ivanka Trump breaks silence
, బుధవారం, 19 అక్టోబరు 2016 (10:02 IST)
"నేను మరో 20 యేళ్ల తర్వాత పుట్టి ఉంటే... నా కూతురితో ఖచ్చితంగా డేటింగ్ చేసేవాడిని" అంటూ 2008లో ఆయన చేసిన వ్యాఖ్యలను ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. దీనిపై డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా స్పందించారు.  
 
కూతురితో డేటింగ్ ఏమిటి? అని ప్రశ్నించిన సదరు మీడియా సంస్థ... ఇవాంకా (ట్రంప్ కూతురు) ట్రం‌ప్‌కు సెరోగేట్ వైఫ్ (మారు భార్య) అంటూ ఛండాలపు ప్రచారం కూడా చేసింది. దీనిపై ట్రంప్ కూతురు ఇవాంక్ స్పందించింది. బాధ్యత గల మీడియా తండ్రీకూతుళ్ల గురించి అలా ప్రచారం చేయవచ్చా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
తన తండ్రి అలా మాట్లాడం తప్పేనని, ఆ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని ఇవాంక తెలిపింది. అయితే, ఆ వీడియో బయటకు వచ్చిన వెంటనే కుటుంబానికి, అమెరికన్లకు ఆయన క్షమాపణలు చెప్పారని, తన తండ్రి గురించి మీడియా కంటే తనకే ఎక్కువ తెలుసని, అందుకే తన తండ్రిని తాను అర్థం చేసుకోగలనని ఆమె అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లిపందిరిలో సందడే సందడి.. వరుడు అరెస్ట్.. పెళ్ళి పెటాకులు.. ఏం చేశాడంటే?