Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

1890 నాటి సంప్రదాయం... ఒక్క అందగత్తెతో బద్దలైంది... ఏంటది?

1890 నాటి సంప్రదాయం... ఒక్క అందగత్తెతో బద్దలైంది... ఏంటది?
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:24 IST)
బ్రెజిల్‌లోని వాయవ్య దిక్కున వున్న నోయివా కార్డిరోలో 600 మంది మహిళలు నివాసం వుంటున్నారు. వారంతా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్నవారు. వారిలో కొందరికి వివాహం అయింది కానీ వారి భర్తలు మాత్రం వారాంతాల్లో మాత్రమే ఇక్కడికి వస్తుంటారు.
 
ఇక వీరికి పుట్టిన పిల్లలు... అంటే అబ్బాయిలకి 18 ఏళ్లు నిండితో ఈ మహిళలతో కలిసి వుండే అవకాశం లేదు. అలాంటివారినందరినీ అక్కడి నుంచి పంపేస్తారు. చెప్పాలంటే ఇక్కడ పురుషులకు స్థానంలేదన్నమాట. ఈ ప్రాంతం సుదూరంగా ఓ లోయలో వుంటుంది. ఈ నిబంధన ఇప్పటిది కాదు. 1890ల నాటిది. అప్పుడు ఏం జరిగిందంటే... ఓ యువతితో సహా ఆమె కుటుంబం కాథలిక్ చర్చి నుండి బహిష్కరించబడినప్పుడు, ఆమె వివాహం చేసుకోవాల్సిన వ్యక్తిని విడిచిపెట్టేసింది. ఐతే ఆ తర్వాత ఆమె వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొంది.
 
అలా పురుషులు తమపై చేసిన దాష్టీకానికి వ్యతిరేకంగా ఆమెకి మద్దతు తెలుపుతూ క్రమంగా కేవలం స్త్రీలు మాత్రమే ఆ ప్రాంతంలో వుండటం మొదలుపెట్టారు. అక్కడ కేవలం స్త్రీలు తప్ప పురుషులకి చోటులేకుండా చేశారు. అలాంటి వాతావరణంలో వుండేందుకు వారు ఇష్టపడ్డారు. ఐతే వీరిలో అత్యంత అందమైన ఓ స్త్రీ ఎప్పటినుంచో వస్తున్న ఈ కట్టుబాటుని సడలించాలని నిర్ణయించుకుంది. ప్రతి ఒంటరి స్త్రీ తమకు తగిన భర్తను ఎంచుకోవాలని తెలిపింది.
 
వారిలో 23 ఏళ్ల నెల్మా ఫెర్నాండెజ్ చెపుతూ... మేమందరం ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటున్నాం కానీ భర్త కోసం ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని అనుకోవడం లేదు. ఎవరైతే వారివారి ప్రాంతాలను వదిలేసి మాకోసం ఇక్కడికి వస్తారో వారినే పెళ్లాడాలనుకుంటున్నాం. ఐతే మేము విధించే షరతులకు తమను పెళ్లాడబోయేవారు అంగీకరించి తీరాల్సిందే అంటోంది. మరి వారు అనుకుంటున్నట్లుగా జరుగుతుందో లేదో... వాళ్లందరికీ తగిన భర్త దొరుకుతాడో లేడో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత.. ఇకపై రోజువారీ పర్యవేక్షణ