Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గే' అని తెలియగానే... కాళ్లుచేతులు కట్టేసి.. భవనం పైనుంచి కిందికి తోసేసిన ఐసిస్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారే కనిపించడం లేదు. ఈ ఉగ్రవాదుల పట్ల ప్రపంచంలోని అగ్రరాజ్యాలు సైతం మతకవైఖరిని అవలంభిస్తుండటంతో వీరి ఆగడాలకు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి గే

Advertiesment
ISIS
, గురువారం, 12 జనవరి 2017 (06:56 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారే కనిపించడం లేదు. ఈ ఉగ్రవాదుల పట్ల ప్రపంచంలోని అగ్రరాజ్యాలు సైతం మతకవైఖరిని అవలంభిస్తుండటంతో వీరి ఆగడాలకు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి గే అని తెలియగానే అతని కాళ్లు చేతులు కట్టే భవనంపై నుంచి కిందికి తోసేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త సంచలనంగా మారింది. 
 
డెయిలీ మెయిల్ కథనం ప్రకారం, తమ అధీనంలో ఉన్న ఓ ఖైదీని ‘గే’ (స్వలింగ సంపర్కి) అని గుర్తిచారు. దీంతో సదరు ఖైదీ కళ్లకు గంతలు కట్టి భవంతిపైకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత, అతని కాళ్లూచేతులు కట్టేశారు. అతనిపై ఉన్న నేరారోపణలు చదివిన అనంతరం, భవనం పై నుంచి కిందికి తోసేశారని పేర్కొంది. ఐఎస్ చట్టం ప్రకారం, గే లకు మరణశిక్ష విధిస్తారు. బహిరంగంగా అందరి చేత రాళ్లతో కొట్టించడం లేదా, భవంతిపై నుంచి తోసేయడం ద్వారా వారికి మరణ శిక్ష విధించినట్టుగా ఐఎస్ భావిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్‌కు సుష్మా స్వరాజ్ వార్నింగ్.. సారీ చెప్తారా? వీసా రద్దు చేయమంటారా?