Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూఢచర్యం చేస్తున్నాడనీ గుండెల్లో కత్తి దించారు.. తలను తుపాకీతో పుచ్చకాయలా పేల్చేశారు!

Advertiesment
Isis
, మంగళవారం, 10 మే 2016 (15:37 IST)
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలను, అరాచకాలను, అకృత్యాలకు అడ్డుకట్ట వేసేవారే కనిపించడం లేదు. ఏమాత్రం కనికరం లేకుండా నరమేథం సృష్టిస్తున్న ఇసిస్ ఉగ్రవాదులు.. గూఢచర్యం చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత మార్చేందుకు సరికొత్త పంథాను ఎన్నుకున్నారు. ఇప్పటివరకు చేసిన హత్యలు ఒక ఎత్తు అయితే.. ఈ హత్య మరో ఎత్తులా ఉంది. 
 
ఇప్పటివరకు బహిరంగంగా ఉరి తీయడమో రాళ్లతో కొట్టి చంపడమో లేక.. బాంబును అమర్చి పేల్చేయడమో, మోకాళ్లపై నిలబెట్టి పీక కోయడమే లాంటివి చేసే ఉగ్రవాదులు ఇప్పుడు మరో కొత్త పంథాను ప్రారంభించారు. చుట్టూ జనాలు చూస్తుండగా నేరుగా కత్తిని గుండెల్లోకి దింపుతున్నారు. ఆ కత్తి అలా ఉంచే తలకు తుపాకీని ఆనిచ్చి ఫట్ మని కాల్చేస్తున్నారు. 
 
సిరియాలోని రక్బా ప్రాంతంలో వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా వాయు సేనలకు పరోక్షంగా సహకరిస్తున్నాడనే కారణంతో అబ్దుల్ హాదీ ఎస్సా అల్ సాలెం అనే వ్యక్తిని ఇసిస్ ఉగ్రవాదులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి మరణ శిక్ష వేశారు.
 
చుట్టుపక్కల వారిని బలవంతంగా రోడ్డుపైకి పిలిపించి.. వారంతా చూస్తుండగా నడిరోడ్డుపై కూర్చొబెట్టి కళ్లకు గంతలు కట్టి మొనదేలిన కత్తితో గట్టిగా అదిమిపట్టి నేరుగా గుండెలోకి దించారు. ఆ బాధకే అతడు గిలగిలా తన్నుకుంటుంగానే నేలపై మోకాళ్లపై కూర్చోబెట్టి తలకు తుపాకీ అనిచ్చి తలను పుచ్చకాయలా పేల్చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని రోడ్డు డివైడర్‌కు హెచ్చరికగా అమర్చారు. ఈ వీడియోను ఫొటోలను కొందరు ఆన్‌లైన్‌లో పెట్టింది. ఈ పాశవిక హత్యా వీడియోను చూసిన ప్రపంచం ఇపుడు నివ్వెర పోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేక్ గ్యాంగ్ కీచకులంతా ముద్దాయిలే... 11న శిక్షలు ఖరారు : రంగారెడ్డి కోర్టు