Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గడ్డాలు తీసేసి... ఆడవారిలా బురాఖాలు ధరించి పారిపోతున్న ఇసిస్ తీవ్రవాదులు..

'ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తాం. షరియత్ చట్టాన్ని అమలు చేస్తాం, ఇస్లాం కోసం ప్రాణాలు ఫణంగా పెడతాం' అంటూ ప్రగల్భాలు పలికిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఆడంగి వేషంలో పారిపోతున్నారు. గడ్డాలు తీసేసి, ఆడవార

గడ్డాలు తీసేసి... ఆడవారిలా బురాఖాలు ధరించి పారిపోతున్న ఇసిస్ తీవ్రవాదులు..
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (15:34 IST)
'ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తాం. షరియత్ చట్టాన్ని అమలు చేస్తాం, ఇస్లాం కోసం ప్రాణాలు ఫణంగా పెడతాం' అంటూ ప్రగల్భాలు పలికిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఆడంగి వేషంలో పారిపోతున్నారు. గడ్డాలు తీసేసి, ఆడవారిలా బురఖాలు ధరించి పలాయనం చిత్తగిస్తున్నారు. అమెరికా, ఇరాక్ సేనల దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. దేవుడా అంటూ పరుగులు తీస్తున్నారు. వీరిలో సాక్షాత్తూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ సైతం ఉన్నాడనీ అమెరికా సేనాధికారులు చెపుతున్నారు. 
 
ఇరాక్‌లో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు... అక్కడి ప్రజలను గత రెండేళ్లుగా ఆయుధాలతో భయపెట్టి, బానిసలుగా చేసుకుని వేధిస్తూ వస్తున్నారు. వీరి ఆగడాలు మరింత ఎక్కువకావడంతో అమెరికా, ఇరాక్ సేనలు రంగంలోకి దిగాయి. ఈ దళాలు జరుపుతున్న భీకర దాడులను తట్టుకోలేక తీవ్రవాదులు పారిపోతున్నారు. గతంలో విధించిన శిక్షలు అమలు చేసేందుకు తవ్విన బందిఖానాల్లో బందీలుగా మారిపోయి, డ్రామాలు ఆడుతూ, బ్రతుకు జీవుడా అంటూ పారిపోతున్నారు. 
 
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఏలిన నగరాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్న సంకీర్ణసేనలు, సొరంగాల్లో దాక్కున్న ఉగ్రవాదులను వెలికి తీస్తోంది. సంకీర్ణసేనలు ప్రయోగిస్తున్న పొగ బాంబులకు కలుగుల్లోని ఎలుకల్లా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బయటకి పరుగులు తీస్తూ, తూటాలకు బలవుతున్నారు. ఈ క్రమంలో వారి నుంచి ఆయుధాలు, ట్యాంకర్లు, ఇతర యుద్ధ సామగ్రిని సంకీర్ణసేనలు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇరాక్‌లో ఇంచుమించు వారి పీడ విరగడైపోవడంతో సిరియాలో కూడా వారికి స్థానం లేకుండా చేయాలని కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్.. మంచు కురిసేలోపే ప్రతీకారం