Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ సైనికులే టార్గెట్.. మొబైల్స్ ద్వారా భారత్‌లోకి వైరస్.. ఐఎస్ఐ ప్లాన్!

Advertiesment
ISI 'poisoned' CIA ex-official in Pakistan
, శనివారం, 7 మే 2016 (12:12 IST)
భారత్‌లో పాకిస్థాన్ టెర్రరిస్టుల చొరబాటు ఇప్పటి మాట కాదనే విషయం తెలిసిందే. దశాబ్ధాల తరబడి భారత్ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ చొరబాట్లు సాంకేతికతను పులుముకుంటున్నాయి. పాకిస్థాన్ స్నూపింగ్ ఏజెన్సీ ఐఎస్‌ఐ మొబైల్ ఫోన్ల ద్వారా మాల్ వేర్ ఎంబడెడ్ వైరస్‌లను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 
 
టాప్ గన్-ఎంపీజెంకీ- వీడీజెంకీ- టాకింగ్ ఫ్రాగ్ లాంటి మొబైల్ గేమ్‌లను మార్గాలుగా ఐఎస్ఐ ఎంచుకుంటోంది. అంతేగాకుండా భారత మాజీ సైనికులే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మాజీ సైనికులను లక్ష్యంగా చేసుకుని వారికి ఉద్యోగాలు-డబ్బులు ఆశ చూపిస్తూ మొబైల్స్ ద్వారా ఈ వైరస్‌ను భారత్‌లో వ్యాప్తిచేసేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోంది. ఈ వైరస్ సాయంతో భారత్‌లో కీలక సమాచారం రాబట్టాలనేది ఐఎస్‌ఐ లక్ష్యమని తెలుస్తోంది. 
 
ఐఎస్ ఐ వలలో పడి ఇలా సాఫ్ట్ వేర్ ద్వారా వైరస్ లను వ్యాప్తి చేస్తున్న మాజీ సైనిక అధికారులను భద్రతా వర్గాలు పట్టుకుంటున్నాయి. 2013 నుంచి 2016 మధ్య ఏడుగురు ఎక్స్ సర్వీస్ మెన్ లను ఏడుగురిని అధికారులు అరెస్టు చేశారు. ఇలా మొబైల్ అప్లిక్లేషన్స్ పై ఒక కన్ను వేశామని పూర్తి స్థాయిలో దీన్ని నిరోధించానికి ప్రయత్నాలు చేస్తున్నామని భద్రతాధికారులు చెబుతున్నారు.  
 
అంతేకాదు  హార్డ్ డిస్క్ లను ఒక చోట నుంచి మరో చోటకు తరలించేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పెన్ డ్రైవ్ లతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మొయిల్స్‌ను క్లిక్ చేసేటప్పుడు అవి ఎలాంటి మొయిల్స్‌లో చెక్ చేసుకోవాలని సూచిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే ప్రాణదాన ట్రస్టు ద్వారా 40 మంది చిన్నారులకు వెన్నెముక శస్త్రచికిత్స